మనం ఎక్కడైనా ఎక్కువ కాలం గడిపితే దానితో అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం సంఘానికి దారితీస్తుంది.సంఘంలో ఉండాలంటే కొన్ని పాటించాలి.మనిషి సంఘ జీవి కనుక పాటిస్తాడు.
సమాజంలో మనిషి కుటుంబంతో నివిసిస్తుంటాడు,ఒక్కడుగా జీవనం సాగించడానికి మొగ్గుచూపడు. తలిదండ్రులు, ఉంటే వారి తలిదండ్రులు, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు పిల్లలు, ఇలా ఒక పెద్ద కుటుంబంతో జీవిస్తుంటాడు.ఒక కుటుంబంలో ఒకరే పెద్దగా ఉన్నంతకాలం ఆ కుటుంబం చిరకాలం పదిలంగానే ఉంటుంది.
ఎక్కడైనా ఎప్పుడైనా పోరపోచ్చులు ఉన్నా కూడా ఇంటి పెద్ద దానిని సమస్య కనివ్వడు.అలా చేయడం ఇంటి పెద్ద బాధ్యత కూడా.
ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ చిన్నచిన్న విభేదాలు రావడం సహజం. వాటిని పెద్దవి కానివ్వకుండా చేయడం కూడా సౌధసరధి పని.
పూర్వం, పెద్దలు ఏం చెప్పినా, అది తు.చ. తప్పకుండా పాటించేవారు.
ఎవరైనా సరే...
ఎవరైనా సరే...
అప్పటి రాముడి నుంచి...
రామా! అడవికి వెళ్లి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యి అని దశరధుడు చెప్పినవెంటనే రాముడు సరేనన్నాడు వేరేం మాట్లాడలేదు.
రామా! అడవికి వెళ్లి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యి అని దశరధుడు చెప్పినవెంటనే రాముడు సరేనన్నాడు వేరేం మాట్లాడలేదు.
అదేంటి నానగారు 14 సంవత్సరాలా? దేనికండి? అని ప్రశ్నవేయలేదు.మరో మాట లేకుండా బయలుదేరాడు.
మితోపాటే నేను అని సీతమ్మవారు నేను కూడా అని లక్ష్మణుడు బయలుదేరారు.
అరె! నిన్ను కదయ్యా వెళ్లమంది నన్ను కాదు నేనెందుకు రావాలి? ఆనలే సీతమ్మ. నేనిక్కడే ఉంటా నువ్వెళ్ళి వచ్చే య్ ఆనలే లక్ష్మణుడు.
మొత్తం అయోధ్యలో ఉన్న ప్రజలందరూ రామునితో బయలుదేరారట అడవికి... శ్రీరామాయణం చెప్తోంది.రాముడు సీతకి భర్తకనుక,వారిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఉన్నది కనుక సీతమ్మ రాముని వెంట వెళ్లిందంటే అర్థముంది మరి లక్ష్మణస్వామి ఎందుకు వెళ్లినట్టు?
అదే భ్రాత్రుసంబంధం.
భరతుడు చిత్రకుటమునకి వచ్చి ప్రాయోపవేశం చేస్తానంటాడు. అట్లాంటి సమాజం నుండి వచ్చిన వాళ్ళం మనం.
బంధం-సంబంధం:
సాధారణంగా ఒక తలిదండ్రులకి పుడితే రక్తసంబంధం ఏర్పడుతుంది.పెళ్లి అనే ఒక ప్రక్రియ ద్వారా ఒక ఇంటి అమ్మాయిని తెచ్చి సంబంధం ఏర్పరుచుకుంటున్నాం.ఈ సంబంధం ఒక బంధంగా మార్చడానికి తాళి కట్టి భార్యకి భర్త అవుతున్నాడు. భార్యభర్తల బంధం విడదీయరానిదై ఉండటానికి సమాజం పెళ్లి అన్నది పెట్టింది. మిగిలిన ఎన్ని బంధాలు ఎలా పోయిన భార్య భర్త జీవించినంత కాలం తనతోనే సహజీవనం చేయాలి.ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం.
contd...