Monday, June 25, 2012

పరివర్తన...


అది నా (PG Diploma in 3d Animation) Entrance exam రోజు...


బుజ్జీ! pencil, eraser, sharpner ఇవ్వమ్మా! అంటూ సిద్ధమవుతున్నా...
examకి పది నిముషాల ముందే హాల్లో కూర్చున్నా...


ఎప్పటిలాగే....
దేవుడా!! ఓ మంచి దేవుడా!!
ఈ ఒక్క ఎగ్జాము పాసయ్యేటట్టు చూడు తండ్రీ!
నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు...
ఈ ఒక్కసారీ నా మాట విని నన్ను పాస్ చేయించు...
(ఎప్పుడు ఇలానే... ఎప్పుడూ ఏమి కోరుకోలేదని కొన్ని వందల కోరికలడిగుంటా... :) ఆ పైవాడూ నా ముచ్చటని  ఎప్పుడూ కాదనలేదు కూడా.)


పరీక్ష మొదలయ్యింది...


Question  paper ఇచ్చేసారు... ఒక్కసారి అన్ని questions చూసా...


ఒక్క section మాత్రం మొత్తం creativity & visualization మీద...
visualization దగ్గరకి వచ్చేటప్పటికి ఇది కొంచం టైం పడుతుందని మిగిలిన sections complete చేశా ముందు...

మనకసలే సినిమా knowledge ఎక్కువ కదా! సినిమాకి సంబంధించిన సెక్షన్  అంతా complete అయిపోయింది ...

match the following... fill-up the blanks... etc., అన్నీ అయిపోయాయి... 

కొన్ని బొమ్మలు గీయమని ఇంకో సెక్షన్ .. అది కుడా ఐపోయింది...

Visualization దగ్గరికి వచ్చా...

ఒక  పేజిలో 3 బొమ్మలు ఉన్నాయి... 6 బొమ్మలతో ఒక concept చూపించాలి..
ఆ   పై వాటిని బట్టి  మిగిలిన 3 బొమ్మలు  మనం గీసి చూపించాలి... పైన ఉన్న వాటిని  లింక్ చేస్తూ... కాన్సెప్ట్ దెబ్బతినకుండా....

ఇచ్చిన  బొమ్మలు ఇలా ఉన్నాయి....


మొదటి బొమ్మ లో ఒక బోయవాడు గొడ్డలి పట్టుకుని అడవికి బయల్దేరినట్టు... దూరంగా ఒక చెట్టు మిద ఒక పక్షి గూడుకట్టుకుని ఉంది...
రెండవ బొమ్మలో... ఆ బోయవాడు ఈ పక్షి, గూడు ఉన్న చెట్టుని నరుకుదాం అని సన్నద్ధం అవుతున్నాడు.
మూడవ బొమ్మలో చెట్టు మొదలు కొట్టనారంభించాడు...


పై మూడు బొమ్మలు చూసి... నా ఆలోచన ఎక్కడికో వెళ్లిపోయింది... 

రొజూ రామాయణ  పారాయణ వల్లనో... లేక కథలమీద  ఎక్కువ  మక్కువ  వల్లనో... తెలిదు కానీ...
వెంటనే... రామాయణం ఆవిర్భవించడానికి కారణమైన  బోయవాడు.... వాడు కామమోహితాలైన  క్రౌంచ  పక్షులని తన  విల్లంబుతో కొట్టేస్తే పక్షి విలవిలలాడే  సీన్  కళ్ళముందు కదలాడింది...

వాల్మీకి నోటి వెంట  వచ్చిన శ్లోకం వెంటనే జ్ఞప్తికి వచ్చింది...


మా నిషాద ప్రతిష్టాత్వమగమః సాస్వతీ: సమాః
యత్క్రౌంచ మిథునాదేకం అవధీ: కామ మోహితం.
కామమోహితాలై ఒకదాని వెనక ఒకటి తిరుగుతూ రతిని అనుభవిస్తున్న క్రౌంచ పక్షులలో ఒకదానిని బోయవాడు తన విల్లంబులతో కొట్టేడు... ఆ దెబ్బకి ఒక పక్షి నేలకూలింది... మరో పక్షి పడి ఉన్న ఈ పక్షి చుట్టూ తిరుగుతూ విలపిస్తోంది... ఇది చుసిన వాల్మీకికి కోపం వచ్చి తన ప్రమేయం ఏమి లేకుండా ఆశువుగా తన నోటివెంట వచ్చిన మొట్టమొదటి శ్లోకం.

దారిదోపిడీలు చేసుకు బ్రతికేవాడు... కిరాతకుడు... అయిన రత్నాకరుడు(వాల్మికి అసలు పేరు) మనసు చలించి,హృదయం ద్రవించి,ఆశ్రావిలేక్షణుడైనాడు... ఎలాంటివాడు ఎంతటి పరివర్తన చెందాడు??   

బోయవాడిని, పక్షిని చూడగానే దీనికి ఎలాగైనా లింక్ చేయాలి అనిపించింది...
concept పాతదే... కానీ thought కొత్తగా ఉండాలి...

3 బొమ్మలు గీయాలి... ఎలా present  చెయ్యాలి అని ఆలోచన వస్తే 3 కాదు 30 కాదు ఎన్ని బొమ్మల్లో అయినా చూపించవచ్చు... ఒక్క బొమ్మలోనే మొత్తం చూపించచ్చు...

కొన్ని మాటల్లో చెప్పగలం కొన్ని చేతల్లో చెప్పగలం...
Actions speak louder than words కదా...!
దృశ్యరూపంలో ఐతే ఏదైనా తొందరగా అర్ధమవుతుంది...
అందుకే Engineeringలో  drawingకి ఎక్కువ ప్రాధాన్యత.


ఆలోచించడం start చేశా...


ఈ బోయవాడు చెట్టుని నరుకుతున్నాడ?? లేదా చెట్టుని నరుకుతున్నట్టు నటిస్తూ పక్షి,పక్షి పిల్లలు/పక్షి పెట్టిన గుడ్లుకి ఎరా..? అంటే... పక్షిని పట్టటం కోసం చెట్టు నరకక్కర్లే... చెట్టెక్కి పక్షిని జడిపించి లేదా చంపి తీసేస్కోవచ్చు.
చెట్టుని నరకడం ప్రారంభించాడు... దీనితో బోయవాడు వచ్చింది చేట్టుకోసం అని confirm అయిపొయింది... చెట్టు కోసం అంటే  కట్టెల కోసం అని...

ఇది చుసిన పక్షి... ఒకవేళ పిల్లలుంటే దానితో పాటు తీసుకెళ్ళడానికి వీలు పడే పిల్లలు అయి ఉండొచ్చు ఉండకపోవచ్చు...
ఒకవేళ తనతో తీసుకేళ్ళేదే అయితే గూడు గురించి బెంగ అక్కరలేదు... లేదా... గుడ్లు పెట్టి ఇంకా పొదగలేదు  వాటిని... ఆ గూటితో సహా వాటిని ఇంకో చెట్టు పైకి తీసుకెళ్ళిపోవచ్చు...

ఇలా పరిపరి విధాల ఆలోచన సాగుతోంది...

బోయవాడిది ఒకటే aim... ఎలా అయినా ఈ చెట్టు కొట్టి కట్టెలు పట్టుకు వెళ్లాలి...


పక్షికి... తనను తాను రక్షించుకోవడం,తన గూటిని రక్షించుకోవడం, ఉంటే తన పిల్లల్ని రక్షించుకోవడం... అదే ముఖ్యం కదా!
ముందు మనం బ్రతికుంటే... తరవాత ఇంకేమైనా చెయ్యవచ్చు...
పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయి తన ప్రాణాలు కాపాడుకోవచ్చు... లేదా తన గూడును కూడా తను తీసుకుని ఎగిరిపోవచ్చు... ఈ రెండు options ఉన్నాయ్ పక్షికి...


general గా ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు... కానీ!


పూర్వం ఆదికవికి కలిగిన మార్పు ప్రభావం నా మీద బాగా పనిచేసింది...


ఎలాగైనా వీడిలో మార్పు తీసుకురావాలి...


కొంసేపు పక్షి view లో ఆలోచించి చూద్దాం అని... thinking thinking  thinking...
ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే...
నేను ఎన్ని చెట్లని మారగలను?
నా దురదృష్టం కొద్దీ వీడికి నేనున్న చెట్టే ఎప్పుడూ  దొరికితే...? నా గాతి ఏం కాను?
ఇవ్వళైతే నేను ఇంకెక్కడికో పోతాను... ప్రతి రోజు ఇదే తంతు ఐతే చాల కష్టమైపోతుంది బ్రతుకు అని... 


పక్షికి ఆలోచన కలిగి...వాడితో మొర పెట్టుకుంటే బోయవాడి మనసు కరిగి... వాడు ఇంకేదో చేసుకుంటాడు...
ఇలా వాడి మనసు మార్చేద్దామా? లేక ఇంకేదైనా చేసి వాడిలో మార్పు తీసుకు వద్దామా?? అని అనుకున్నాను... 


సరే ఏదైతే అది అవుతుంది అని బొమ్మ గీయడం start చేశా... గీస్తుంటే... suddenగా pencil పక్షి గూడు నుంచి చెట్టు మొదలు దగ్గరికి జారిపోయి ఒక గీత పడిపోయింది...
ఇదేదో బావుంది...! ఇలా try చేద్దాం అని... అటు ఇటు ఇంకో రెండు గీతలు పెట్టేసా...
పక్షి గూటిని తీసుకుని ఎగురుతున్నట్టు... గూటిని కొంచం కిందకి తీసుకొచ్చా... బోయవాడు దీనిని చూస్తున్నట్టు...


ఇంకో  బొమ్మ లో గూటిని బోయవాడు సగం కొట్టేసిన చెట్టుమొదట్లో ఉంచి..పక్షి వాడితో మాట్లాడుతున్నట్టు గీసా...


మూడవ దానిలో బోయవాడు గొడ్డలి పడేసి తిరిగి వెళ్లిపోతున్నట్టు వేసా...


మరి పక్షి ఏం మాట్లాడింది? వాడు గొడ్డలి ఎందుకు పడేసాడు??
బొమ్మని చూస్తే అర్థమవుతుంది... కాని ఇది explain చేస్తే ఇంకా బావుంటుంది అనిపించింది.... 


రెండవ బొమ్మలో ఏం మాట్లాడింది?? అన్నది పక్కన రాయడం మొదలుపెట్టా..
ఓ మానవుడా! ఈ చెట్టు నరకడం వల్ల నీకోరోజు గడుస్తుందేమో...! నాకు మాత్రం నేను బ్రతికినంత కాలం ఇదే నా నివాసంగా ఏర్పరచుకున్నాను... కావాలంటే ఇంకేదైనా చెట్టు చూసుకో అంటే... నీ మాట నేనెందుకు వినాలి??
పైగా కట్టెలుతో పాటు పక్షి.. పక్షి గుడ్లు దొరికాయని ఒక్క వేటు వేసి వాటిని వాడు తీసుకుపోయినా పోవచ్చు...


ఇలా చెప్తే వింటాడా?? మనిషి కదా.. అస్సలు వినడు...
సరే అని... ఇలా చెప్పించా పక్షి చేత...


ఒరీ! నీకు కావాలంటే నా ప్రాణాలు తీసుకో! నన్నిక్కడికిక్కడే నరికెయ్... అంతగా కావాలంటే నా ప్రాణాలతో పాటు నా   పిల్లలుగా ఈ లోకం ఇంకా చూడని ఈ గుడ్లని కూడా తీసుకో కానీ ఈ చెట్టుని మాత్రం నరకకు...


అదేంటి?? ఈ పక్షికేమైనా మతిపోయిందా?
ఎవరైనా తన ప్రాణాలు కాపాడుకుంటే సరిపోతుంది... నేను బ్రతికితే చాలు అనుకుంటారు...
ఇదేంటి? ప్రాణానికి ప్రాణమైన పిల్లల్ని కూడా తీసుకోమంటోంది...
ఎందుకు ఈ చెట్టుని నరకద్దు? అని పక్షిని ప్రశ్నించాడు...  


అరే! ఏం మాట్లాడుతున్నావ్?? నువ్వున్నది ఈ చెట్టు నీడలో...
ఎంత అమాయకుడివి? నీకు నీడనిచ్చే చెట్టునే నరికేస్తున్నావ్...
కొన్ని సంవత్సరాలుగా ఎంతోమందికి ఈ చెట్టు నీడనిస్తూ చల్లటి గాలినిస్తూ ఎందరికో ఉపయోగపడుతూ ఉంది...
కొన్ని సంవత్సరాలుగా నేనూ ఈ చెట్టువల్ల లబ్ది పొందాను... ఈ చెట్టుపై నివసిస్తున్నాను... నాకు కృతజ్ఞత ఉంది...
ఈ చెట్టుని నరికేయ్యాలి అని నువ్వనుకుంటే ముందు నన్ను చంపేసి తర్వాత నీకు ఇష్టమొచ్చింది  చెయ్యి... అని పక్షి అనేటప్పటికి....


అరెరే..! అల్పప్రాణి... పక్షే అంత ఆలోచనతో తన ప్రాణాలని సైతం లెక్క చెయ్యకుండా ఒక చెట్టు కోసం ప్రాధేయపడింది...
మానవజన్మఎత్తి వివేకం కలిగిన నేను కనీసం ఈ పక్షికి ఉన్న ఆలోచన కూడా లేకుండా ఈ చెట్టుని నరకడానికి సిద్ధపడ్డాను అని సిగ్గు పడి గొడ్డలి అక్కడ పడేసి తిరిగి వెళ్ళిపోయాడు...


దీనితో కథ అయిపొయింది... what an idea valmikiji ?? Hatsoff  to you  :) అనుకున్నా...


కాని ఎక్కడో చిన్న అసంతృప్తి...


ఇక్కడ వాడికి బుద్ధి కలిగి చెట్లు నరకడం మానుకున్నాడు... దీనిని కూడా highlitght చేస్తే బావుండు అనిపించి...


STOP  DEFORESTATION... GO-GREEN  అన్నది add  చేశా...


దీంతో happy... :) satisfied...


ఒక నమ్మకం కలిగింది... ఆ నమ్మకం వమ్ము కాలేదు... :)




    
  




No comments: