Thursday, February 18, 2016

బంధం అనుబంధం

ఒక ఆఫీస్ లో ...
ఏంటయ్యా ఫణి ఇంకా రాలేదు? give him a call అన్నాడు సుధాకర్  (సుధాకర్ ప్రముఖ software కంపెనీ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు... ఫణి ప్రాజెక్ట్ లీడ్)
ఇవాళ client meet ఉందని తెలుసుగా...??
phone attend అవట్లేదు సర్.
ఎందుకు recruit చేస్తారయ్యా ఇలాంటి వాళ్ళని??
ఫణి ఇప్పుడే కాల్ చేసాడు సర్ కొంచం లేట్ అవుతుందని... వాళ్ళ  fatherకి  సీరియస్ గా ఉందట... మీకు కాల్  చేస్తా అన్నాడు సర్.
ఏవేవో సాకులు చెప్తారు... పని దొంగలు వీళ్ళు... నిన్నటి వరకు ఒక మంచి అభిప్రాయం ఉండేది... ఇప్పుడది పోయింది....
half n hour అయింది.. where is phani?
ఇదిగో sir ఫణి వచ్చేడు... What is this phani? Do you know how important this meeting is to our company?? సారీ sir! fatherకి కొంచం సీరియస్ గా  ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేపటికి లేట్ ఐంది....
హా సర్లే! మీట్ కి అన్ని రెడీయా? you takecare of this meeting. Total responsibility is on u...
meeting commence అయింది...
buzzz.... ఫణి phone ring అవుతోంది... సారీ సర్...
please put it in silent phani..
yes sir !
మీట్ పూర్తయింది... అందరు బయటికొచ్చేరు... ఫణి మాత్రం రూమ్ లో ఉండిపోయాడు.
lets celebrate... yahoo! we have got this project. where is phani...? this credit goes to him... ఫణి where are you man? sir phani is in the conference hall...
సుధాకర్ door తీసేప్పటికి ఫణి సెల్ చూస్తూ  ఏడుస్తూ కూర్చున్నాడు... what happened phani? phone తీసి సుధాకర్ కి ఇచేడు... father expired.. unable to reach u... సుధాకర్ కి మతిపోయింది... ఏమనాలో... ఎలా ఓదార్చాలో తెలియలేదు ఒక్కసారి ఇంతకుముందన్న మాటలు గుర్తోచాయి... am sorry phani.. అసలు ఏమైంది..? 
సడన్ స్ట్రోక్ సర్! హాస్పిటల్ లో జాయిన్ చేసి ఇటొచ్చా సర్... మీటింగ్ అయ్యాక వెళ్లి పోదామనుకున్నా...  ఈలోపే....
sorry ఫణి... i was so rude. నీ position తెలియక... చాల మాటలన్నాను... please forgive me.
duty first ఇంకేదైనా duty తర్వాతే అనేవారు సర్ మా father...
colleagues అందరు లోపలికోచ్చేరు... సుధాకర్ తన కేబిన్ కి వెళ్లి కూర్చున్నాడు... దీర్ఘం గా ఆలోచించసాగాడు...
ఇన్నాళ్ళు డబ్బు status అంటూ తిరిగేను... అమ్మ నాన్న ఎలా ఉన్నారో? అన్న ఆలోచనే రాలేదు...
ఫణికి వాళ్ళ fatherతో ఉన్న attachment సుధాకర్ మనసుని కదిపేసింది.
సుధాకర్ వాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం... తలిదండ్రులు  చాల కష్టపడి సుధాకర్ ని software Engineering చదివించారు...
ఇంజనీరింగ్ అయ్యాక ఇంక చదివించే స్థోమత లేదని తండ్రి అనడంతో... ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టేడు సుధాకర్... మంచి కంపెనీలో job వచ్చింది... ఎక్కడో పూణేలో ఉండాలి... అక్కడ ఎలా ఉంటాడో ఏంటో అని తలిదండ్రులిద్దరూ బెంగ పడుతున్నారు... ఓ రాత్రి ఇంటిదగ్గర ఒక లెటర్ రాసి పెట్టి సుధాకర్  ట్రైన్ ఎక్కి పూణే వెళ్ళిపోయాడు. పూణే వెళ్ళిన తర్వాత life మారిపోయింది ... అలా join అయిన తక్కువ సమయంలోనే ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యేడు... రెండు మూడు సార్లు abroad కూడా వెళ్ళాడు... కానీ ఎప్పుడూ తలిదండ్రుల గురించి ఆలోచించే టైం కాని... తీరిక కానీ ఈ ఉద్యోగం ఇవ్వలేదు...
ఆఫీస్ టేబుల్ మిద ఒక పేపర్ ఎగురుతోంది... అది చూసేప్పటికి... తను ఇంటినుంచి వచ్చేసేప్పుడు రాసిన లెటర్ గుర్తొచ్చింది...
ప్రియమైన నాన్నకి...
ఇన్నేళ్ళు కష్టపడి పెంచినందుకు థాంక్స్... నేను నా బ్రతుకు చూసుకోడానికి వెళ్ళిపోతున్నాను... ఇంకా ఈ చీకటి బ్రతుకులు... చాలీచాలనీ తిండితో నేను జీవించలేను...
ఇది గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చేడు... వెంటనే వాళ్ళమ్మ నాన్నలను చూడాలనిపించింది... ఎవర్నైనా  హత్తుకుని తన బాధని వ్యక్తపరచాలనిపించింది... ఆఫీస్ కి సెలవు పెట్టి  వాళ్ళ ఊరికి  బయల్దేరాడు...
వాళ్ళ ఊరు చేరుకున్నాడు సుధాకర్... ఊరు చాలా  కొత్తగా ఉంది... వాళ్ళుండే ఇల్లు ఇప్పుడు అక్కడ లేదు...ఇంకో ఇంటి తలుపు తట్టెడు... ఏవండి ఇక్కడ చంద్రశేఖర్ రావు గారని ఉండేవారు...?
మీరు?? నేను వారి అబ్బాయిని... నువ్వేనా నాయనా?? వాళ్ళని అంత దీన స్థితిలో వదిలేసి కోట్లు సంపాదించడానికి వెళ్ళింది?  ఆ దౌర్భాగ్యుడిని నేనేనమ్మ... ఇప్పుడెక్కడున్నారు ?? వాళ్ళు అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ పక్కన ఉంటున్నారు...
సుధాకర్ అక్కడికి బయల్దేరేడు... హాస్పిటల్ అనగానే చెడు ఆలోచనలు మొదలయ్యాయి.. వెళ్తూన్నంత సేపూ తల్లికేమైందో తండ్రికేమైందో అన్న ఆలోచనలు తనని పీడిస్తూనే ఉన్నాయ్... ఏమయ్యుండదు ఎదో జలుబో దగ్గో జ్వరమో అయ్యుంటుంది... అని సర్ది చెప్పుకుంటున్నాడు.. హాస్పిటల్ పక్కన ఒక ఇంటి బయట బట్టలు ఆరవేస్తూ ఒకామె కనిపించింది... అమ్మా ఇక్కడ చంద్రశేఖర్ రావు గారు... మా వారే  నాయనా అంది ఆమె...
అమ్మా! అంటూ కాళ్ళమీద పడ్డాడు సుధాకర్. ఎవరు బాబు నువ్వు?
అమ్మ నేను నీ సుధానమ్మ... సుధా.. సుధా... అంటూ తల్లి సుధాకర్ మొహం మీద చెయ్యి వేసింది... అప్పటికి కానీ సుధాకర్ కి అర్థంకాలేదు... తల్లి గుడ్డిదైపోయిందని...
అమ్మా... నాన్నా?? లోపలున్నారు బాబు... ఏవండి సుధా వచ్చేడు... అని అమ్మ చెప్తుందేమో అని చూసేడు... లోపలికెళ్ళి తండ్రిని కౌగిలించుకోవాలని అనుకున్నాడు సుధాకర్... కాళ్ళమీద పడి... తను చేసిన తప్పుని క్షమించమని వేడుకుందాం అనుకున్నాడు...
ఆయన గుర్తు పట్టలేరు బాబు అంది తల్లి...  ఇది విని సుధాకర్ గుండె బద్దలైపోయింది... అయ్యో! మిమ్మల్ని చూద్దామని ఇంత దూరం వచ్చేనే! మీతో కలిసి ఉందామని వచ్చెనమ్మా అని గుమ్మం దగ్గరే కూలిపోయాడు... బాబు అంటూ తల్లి శోకిస్తోంది... సుధాకర్ లోపలికి వెళ్ళేడు...
లోపలికి వెళ్ళేప్పటికి  ఓ పాత కుర్చీలో చిరిగిన పంచతో తండ్రి కుర్చుని ఉన్నాడు... ఇంత దుర్భరమైన స్థితిలో వాళ్ళని చూస్తానని ఊహించలేదు సుధాకర్  నాన్న! నేను సుధాని వచ్చేను అని చెప్తున్నాడు...
తండ్రి  నా బ్రతుకు నేను బ్రతుకుతా.. నన్నొదిలెయ్యండి... ఈ రెండు మాటలే మాట్లాడుతున్నాడు...
సుధాకర్ కి ఏం చెయ్యాలో తెలిట్లేదు... అమ్మదగ్గరికి వెళ్ళేడు.. అమ్మా... నాన్న ఏంటమ్మా... నా మాట వినట్లేదు? నాతో మాట్లాడమని చెప్పమ్మా అన్నాడు...
నువ్ వెళ్ళిపోయాక... ఆ లెటర్ చదివిన దగ్గరనుంచి ఆయన ఈ రెండు మాటలు తప్ప ఇంకేం మాట్లాడట్లేదు బాబు అంది...
సుధాకర్ కి దుఖం కట్టెలు తెంచుకుని ప్రవహించే నదిలా వచ్చేసింది... అయ్యో! ఇంత పాపత్ముడినా నేను... తలిదండ్రులని వదిలి ఏం సాధించెను? ఇది చూడటానికా ఇన్ని కోట్లు సంపాదించింది? ఇదా నేను జీవితంలో సాధించింది అని కుమిలిపోసాగాడు... తల్లి వచ్చి ఒదార్చ సాగింది... నాయనా నీ తప్పేముంది ఇందులో...?  జీవితంలో ఎదగాలనుకున్నావ్ వెళ్ళేవ.. సాధించేవ్... ఆ భగవంతుడు మా తలరాతలు ఇలా రాసేడు మేం ఇక్కడే ఉన్నాం...
పదండి అమ్మా... నేను నీకు కళ్ళు తెప్పిస్తాను... నాన్నకి  treatment ఇప్పిద్దాం... వద్దు సుధా... ఎవరి మీదా ఆధారపడకూడదు అన్నది మీ నానగారి సిద్ధాంతం... ఎన్ని కష్టలోచినా ఎవరిమీద ఆధారపడి బ్రతకలేదు బాబు ఇప్పటివరకు..
కొడుకు మీద ఆధార పడటం కాదమ్మా... కొడుకు బాధ్యత తల్లిదండ్రుల్ని జాగ్రతగా చూసుకోవడం... అని తండ్రి దగ్గరికి వెళ్లి తండ్రిని గెట్టిగా వాటేసుకున్నాడు సుధాకర్...
సుధాకర్... బాబు సుధా... అంటూ వినిపించింది  సుధాకర్ కి... ఒక్కసారి తండ్రిని చూసేప్పటికి తండ్రి కళ్ళలో నీళ్ళు... నాన్నా నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడ్డాడు... సుధాకర్ భుజాలు పట్టుకుని పైకి తీసి హత్తుకుంటాడు తండ్రి... తల్లిని కూడా దగ్గరికి తీసుకుంటాడు సుధాకర్... నాన్నా అమ్మకి treatment చేయిద్దాం పదండి అని తలిదండ్రులని తీసుకుని వెళ్తాడు సుధాకర్...
treatment అవుతుంది... అమ్మకి చూపు వస్తుంది... సుధాకర్ తలిదండ్రులతో కలిసి ఆనందంగా జీవించసాగాడు.
తలిదండ్రులు పిల్లల భవిష్యత్తు బావుండాలనే కోరుకుంటారు... అందుకోసం వారెన్ని కష్టాలు పడినా... వాటిని ఇష్టంగానే స్వీకరిస్తారు... తలిదండ్రులకి  పిల్లలు భారం కాదు.పిల్లలకి తలిదండ్రులు బరువు కాదు...  కాకూడదు...
తలిదండ్రులని ప్రేమించే ప్రతి వ్యక్తికీ ఈ కథ అంకితం.


No comments: