కథలు ఎప్పుడూ అనగనగా తోనే ఎందుకు మొదలవుతాయి?
మనం చిన్నప్పటినుండి కథలు వింటూనే ఉన్నాం.అమ్మ చెప్పినా అమ్మమ్మ చెప్పినా అందరు కూడా అనగనగా ఒక రాజు.... అనో, అనగా అనగా ఒక ఊరిలో... అనో మొదలు పెడతారు.
ఏ కథైతేనేం అనగనగాతోనే మొదలవ్వాలి.అనగనగా లేకుండా మాత్రం కథ మొదలవ్వదు.చాలామటుకు పుస్తకాలలో, పేపర్లలో ప్రచురింపబడిన కథలన్నీ కూడా అలాగే మొదలవుతాయి.
పిల్లలకి జ్ఞానం పెంపొందించడంకోసం చిన్నప్పటినుంచే కథలు చెప్పేవారు.విష్ణుశర్మ మనకి అందించిన పంచతంత్ర కథల వల్ల రాజకుమారులే కాదు మనం కూడా ఎంతో లబ్ధి పొందాం కదా! అలాగే కాశీ-మజిలీ కథలని తెనాలి రామకృష్ణుడి కథలని,విక్రం-భేతాళ్ కథలని చాలా ప్రసిద్ధమైన కథలు మనమెరుగుదుము.
సరదాగా నలుగురు కూర్చుని పిచ్చాపాటి అప్పుడు కూడా ఎవరైనా వక్త ఉంటే వాడు తప్పకుండా ఏదో కథ మొదలు పెట్టకమానాడు.కథలు మనకి కొత్త కాదు కదా!
ఈ కథలేవైతే ఉన్నాయో చాలా మటుకు కల్పితాలు...ఎక్కడో జరిగిన విషయాన్ని అంటే మనం నేరుగా చూడని విషయాన్ని పరోక్షంగా తెలుసుకున్నప్పుడు ఈ కల్పితాలకి ఎక్కువ తావు ఉంటుంది.చాలావరకు జరిగినది కొంత జరగనిది, ఊహించి కల్పించి కథగా మలచి చెప్తారు.
ఇలా కథలు కల్పించి చెప్పడానికి ఊహాశక్తి కావాలి.ఆ ఊహించినదానిని చెప్పడంలో నేర్పు కావలి.
ఒకసారి మా తమ్ముడు బండి పడేసి మా ఇంట్లో తాతగారికో కథ,నాన్నగారికో కథ, చిన్నాన్నకో కథ మొత్తం ౩ కథలు చెప్పాడు.
ఊహకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొన్నిసార్లు నిజమైన కథకంటే ఇలా ఊహించి చెప్పిన కథకే ఎక్కువ విలువుంటుంది.
సరే! ఇంతకీ ఈ అనగనగా కథ ఏంటి? చూద్దాం...
ఇలాగే ఒకడు కథ చెప్పి ఇంకొంతమంది విని ఆ కథని ఇంకొంతమంది అని మరి కొంతమంది విని అలా అని అని విని విని అలా వాళ్ళు అనగా అనగా మనం వినగా వినగా అది కాస్తా అనగనగా గా మారింది...
అప్పటినుంచి ఏ కథ చెప్పినా పూర్వం నుంచి వస్తున్న కథలన్నిటికి ముందు అనగనగా చేర్చి చెప్పడం రివాజు అయింది.

కథని కేవలం కథగానే కాకుండా కథలోని అంతరార్థం తెలుసుకున్నప్పుడే కథకి అసలైన విలువ లభించినట్టు.కథయొక్క నీతి తెలుసుకున్నంత మాత్రాన చాలదు ప్రతి కథలో ఏదో ఒక అంశం(కాన్సెప్ట్) ఉంటుంది దాన్ని కూడా తెలుసుకున్నప్పుడే కథలు కలకాలం చిరకాలం ఉంటాయి.
సరే! ఇంతకీ ఈ అనగనగా కథ ఏంటి? చూద్దాం...
ఇలాగే ఒకడు కథ చెప్పి ఇంకొంతమంది విని ఆ కథని ఇంకొంతమంది అని మరి కొంతమంది విని అలా అని అని విని విని అలా వాళ్ళు అనగా అనగా మనం వినగా వినగా అది కాస్తా అనగనగా గా మారింది...
అప్పటినుంచి ఏ కథ చెప్పినా పూర్వం నుంచి వస్తున్న కథలన్నిటికి ముందు అనగనగా చేర్చి చెప్పడం రివాజు అయింది.
No comments:
Post a Comment