"జంతూనాం నరజన్మ దుర్లభం" అని... అంటే జీవరాసులలోఅన్నిటికంటే మనిషిగా జన్మించడం దుర్లభమని పెద్దలు చెప్తూంటారు.ఒక జీవి మనిషిగా జన్మించడం కొన్ని లక్ష జన్మల పుణ్యఫలం వలనే అని మన పురాణాలు చెప్త్హున్నాయి.అట్లాంటి మానవ జన్మ లభించాక మనిషి తాను చేయవలసిన కార్యాన్ని వదిలేసి ఈ లభించినటువంటి జీవితాన్ని వ్యర్థ పరుచుకుంటున్నాడు.సరైన నడవడి కలిగి,మానవుడు మానవుడిగా ప్రవర్తించినట్టైతే ఉత్తమ గతులను పొందగలడు.మానవుడిగా ఎలా బ్రతకాలో శ్రీ రాముడు త్రేతాయుగంలోనే మనకి నేర్పించాడు.ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ శ్రీ రాముడిలా ఉండలేరు కానీ కొంతలో కొంతైన మనిషిగా ప్రవర్తించడానికి ప్రయత్నిద్దాం!
ముందుగా మానవుడి గురించి 2 మాటలు...
మానవుడు సంఘ జీవి (social animal). వేరే జంతువులకి మనిషికి చాలా తేడ ఉంది.మనిషి మాట్లాడగలడు, ఆలోచించగలడు,తెలివిగా ప్రవర్తించగలడు.మిగిలిని జంతువులు కూడా మనలాగే పుడుతున్నాయి, ఏదో తిని జీవిస్తున్నాయి, సంసారం చేస్తున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, చచ్చిపోతున్నాయి.కానీ మనిషి తనకే సొంతమైన, వేరొక జీవికి దుర్లభమైన వాటిని ఉపయొగించుకుంటున్నాడు.కాలక్రమేణా చాల విషయాలు నేర్చుకున్నాడు.జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నాడు.ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు , తెలివిని వాడుకుంటున్నాడు, ఎన్నైనా ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎందుకైనా ఎంతకైనా చేయటానికి సిద్ధపడుతున్నాడు.
సాధారణంగా మనిషి ఆశాజీవి... వేరే ప్రాణులకి మాటలు రాకో మనిషికి అర్థం కాకో బ్రతికిపోయారు కానీ వాటికి కూడా మాటలు వచుంటేనా మానవుడికి చిక్కులు ప్రరంభామైనట్టే. లోకమంతా గందరగోళం అయిపొదూ? కొన్ని ప్రాణులు ఉ.దా :కుక్క, మార్కట,ఆశ్వ,గాజెంద్రాదులకు కొంత తెలివి ఇచ్చినందువల్ల మనిషి వాటిని కొంచం దరికి చేరుస్తున్నాడు కానీ లేకపోయినట్టైతే వాటివైపే చూడడు,వాటిని చేరదీయాడు. సహప్రాణుల పట్ల ఎలా ప్రవర్తించాలో కుడా రాముడిని చూసి నేర్చుకోవచ్చు .వానరులతోకానీ ఉడత సహాయం కానీ కప్పతో జరిగిన సంఘటన కానీ చూడవచ్చు.మనిషి సహాయం ఇతర జీవులు ఉత్తమ గతులను పొందటానికి దోహద పడుతుంది.
ఇప్పటిలోకంలో చాలమంది రావణులే... 10 తలలు తప్ప మిగిలినవన్నీ సమృద్ధిగా ఉన్నాయి.కలియుగంలో ధర్మం ఒక్కపాదం మీద నడుస్తుందన్నారు కానీ ఆ పాదాన్ని కూడా తెగనరికేస్తున్నారు ఈ నాటి మానవులు. మాంసాహార భక్షణం దగ్గరనుంచి మానభంగాలవరకు మన పురాణాలలో పేర్కొన్న రాక్షసులకి దీటుగా, ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారు.
జీవితాన్ని మంచిగా మానవత్వంతో సాగించాలి.మాధవ సేవగా మనవ సేవ, సర్వప్రాణి సేవ చేయాలి.
మాధవ సేవ చాల సులభం!
పోతనామాత్యుడు భాగవతంలో చెప్తాడు
"కమలాక్షునర్చించు కరములు కరములు
జీవితాన్ని మంచిగా మానవత్వంతో సాగించాలి.మాధవ సేవగా మనవ సేవ, సర్వప్రాణి సేవ చేయాలి.
మాధవ సేవ చాల సులభం!
పోతనామాత్యుడు భాగవతంలో చెప్తాడు
"కమలాక్షునర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
శేష సాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు
విష్ణునాకర్ణించు వీనులు వీనులు
దేవదేవుని చింతించు దినము దినము
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి " అని మనకి ఈ జన్మ లభించినది వాడి వల్లే! అట్లాంటి స్వామిని కీర్తించకుండా ఏది చేసిన వ్యర్థమే!
ఎన్నో జన్మల పుణ్యఫలం వలన కలిగిన ఈ జన్మని చరితార్థం చేసుకోవడానికి చాల మార్గాలున్నా కూడా అత్యంత సులువైన పద్ధతిని మన పెద్దలు చూపించారు.ముఖ్యంగా కలియుగంలో స్వామిని చేరడం ఎంత సులభమో! కలియుగంలో కేవలం నామసంకీర్తనంతో స్వామిని చేరుకోవచ్చు అని వారి జీవితాన్ని సార్ధక్య పరుచుకున్న వారిలో శ్రీ కాంతకృష్ణమాచార్యులు, అన్నమాచార్యులు, రామదాసు, మొదలైనవారు మనకి మార్గదర్శకులు.
ఈ జీవితాన్ని సార్థక్యం చేసుకోవడానికి శ్రీహరికీర్తనం చేస్తే చాలు."హరి" అన్న ఒక్క పదం చాలు
"హరిర్ హరతి పాపాని దుష్ట చిత్తై రపిస్మ్రుతః ...
జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరితి అక్షరద్వయం" అని హర్యష్టకంలో చెప్పారు కదా!
హరి అంటే చాలు అన్ని పాపలు తొలగిపోతాయి.
శ్రీహరి పద చింతనలో ఉన్న ఆనందం వర్ణింపదగనిది.అంటే అది అనుభవిస్తేతప్ప దాని రుచి తెలియదు!!
కనుక మానవ జన్మ విలువని తెలుసుకుని ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా హరి చింతనతో గడుపుదాం!
No comments:
Post a Comment