కలలు కనండి.... సాకారం చేసుకోండి.. అని ఎవరో మహానుభావుడు అన్నాడు.
ఆయన కలలు సాకారం చేసుకోమ్మని అంటే మనవాళ్ళు అలా కలలు కంటూనే ఉన్నారు... పైగా కలలు రావాలంటే ఎక్కువ సేపు నిద్రపోవాలి అని 'కలలు కనండి' అన్నదానిని నిర్వచించి చాలామంది అదే పనిగా పడుక్కుంటున్నారు.
పడుక్కుంటే పడుక్కున్నారు... ఏం కలలు కంటున్నారో ఎంతమంది సాకారం చేసుకుంటున్నారో...?
మనకి తెలియకపోయినా వారికి తెలిస్తే చాలు.
ఈ పోటీ ప్రపంచంలో కొంతమందికి నిద్రే కరువైపోతోంది.
పని వత్తిడి వల్ల ఇంటికి చేరక ఆఫీసులోనే నిద్రపోతున్నవాళ్ళు కూడా ఉన్నారు కదా!
సుఖంగా నిద్రపోయా అని అన్నవాళ్ళూ లేకపోలేదు కానీ కంటినిండా కునుకు తీసి చాలా రోజులయిందిరా అబ్బాయ్! అన్నవాళ్ళే ఎక్కువ.
కొన్నిసార్లు పాడు కలలు వస్తే ఠక్కుమని నిద్రలోంచి లేచి కూర్చుంటారు... ఉలిక్కి పడుతుంటారు...
కొన్ని కలలు చాల అందంగా ఉంటాయి... ఏ లక్షాదికారిగానో.. దేవకన్యలతోనో... నచ్చినవాళ్ళతోనో... ఇష్టమైన వస్తువుతోనో,ఇష్టమైన ప్రదేశంలోనో... ఇలా నచ్చినవి చాలా ఉంటాయి...
కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనలో చాలామందికి ఇలా అనిపించి ఉండొచ్చు...
అరె! ఇదెప్పుడో అయిపోయిందే... కాని మళ్ళీ ఇప్పుడెందు మళ్ళీ జరుగుతోంది? అని...
మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరాల్లో మతిమరపు ఒకటి.
అయినవన్నీ గుర్తుంచుకుంటే ఇంకేమైనా ఉందా??
లోకమంతా పిచ్చేక్కిపోతుంది... జంబలకడిపంబ అయిపోతుంది...
కలకి ఊహకి చాలా దగ్గర సంబంధం ఉంది... ఎక్కువగా ఊహించుకుని రోజంతా అదే ఆలోచిస్తూ ఉంటే రాత్రి కలలో కుడా అదే వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయని మన శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఊహ,కల మనసుతో ముడిపడి ఉంటాయి... మిగిలిన జంతువులకి మనిషికి తేడా ఇక్కడే.. మనిషికి ప్రకటించే శక్తిని ఇచ్చాడు... అది వాక్కు ద్వారా అయినా సరే వ్రాత ద్వారా అయినా సరే...
మనం మనసులో ఏమనుకుంటే అది అదేవిధంగా జరిగితే?? కన్నకలలు, ఊహలు నిజమైతే??
మనం ఎలా భావిస్తే అది అలా జరిగితే?
to be continued...
No comments:
Post a Comment