అమ్మా! ఎంతసేపమ్మా? స్కూల్‌కి టైం అయిపోతోంది... క్యారేజ్ పెట్టు
తొందరగా...
రోజూ ఇదే గోల ఇంట్లో. . .
అమ్మ ఎంతకీ క్యారేజ్ పెట్టదు,నానగారి పేపర్ చదవడం అవదు. నాకేమో స్కూలుకి టైం అయిపోతుంది.
నాకస్సలు అర్థం కాదు అంత పెద్ద పేపర్ ఎందుకు తయారు చేస్తారో?
అదేదో మా సోషల్ టెక్స్ట్ బుక్ పజీలన్నే విడిగా తీసి అతికించినట్టు ఉంటుంది. నాకస్సలు నచ్చదు పేపర్ చదవడం. కానీ నానగారు మాత్రం రోజూ చదివేస్తూనే ఉంటారు. పైగా నన్ను కుడా చదవమంటారు.
నేను స్నానం చేసి,దేవుడికి దణ్ణం పెట్టి, బుక్స్ సర్దుకునే వరకు అలా చదువుతూనే ఉంటారు.అదే టైంకి గురయ్య వచ్చేస్తాడు...
గురయ్య రిక్షాబెల్ కొడుతూనే ఉంటాడు... అప్పటిక్కానీ నాకు క్యారేజ్ ఇవ్వదు అమ్మ.
గురయ్య ఇంకా రాలేదు కదా? అంటుంది అమ్మ.
గురయ్యా.... గురయ్యా... అని నేను పిలిస్తే గురయ్య పలికేదాకా క్యారేజ్ ఇవ్వదనమాట.
అదిగో గురయ్య బయటే ఉన్నాడు... క్యారేజ్ ఇస్తే నేను స్కూలుకి వెళ్ళొస్తా అమ్మా...
గురయ్యేమో... బాబు... మీదే లేటు.. స్కూలుకి టైం అయిపోనాది... అందరూ వచ్సారు... మీరోస్తే స్కూల్‌కి పోడమే!
నానగారంటే గురయ్యకి ఎంతో గౌరవం,మార్యాదాను.బాబుగారు అనే అనేవాడు.నన్ను కూడా చినబాబు మీరు అనే అంటాడు...నాకున్న చనువుకొద్దీ గురయ్య నువ్వు అనేస్తా నేను.

మా స్కూలు మా ఇంటినుంచి ఓ 3 కి.మీ. దూరం ... మా ఇంటి ముందే సినిమా హాలు...
సినిమా పోస్టర్లు చూస్తూ అలా అందరితో గోల గోల చేస్తూ రిక్షాలో వెళ్ళేవాడిని
స్కూలుకి.
రోజూ ఉదయం సాయంత్రం కూడా రిక్షాలోనే స్కులుకెళ్ళి ఇంటికి వచ్చేవాడిని.
గురయ్యకి కుదరకపోతే నానగారు అప్పుడప్పుడు ఆయన లూనామీద దింపేవారు.

రిక్షా ఎక్కిన దగ్గర నుంచి స్కూలుకి దింపేవరకు అలా
మాట్లాడుతూనే ఉండేవాడు గురయ్య.
గురయ్య నాకు చిన్నప్పటి నుండి తెలుసు.
గురయ్య నాకు చిన్నప్పటి నుండి తెలుసు.
నన్ను స్కూల్‌కి దింపడమే
కాదు... ఉదయం పూజకి పూలు తెచ్చేవాడు, నెలవారీ సామాన్లు తెచ్చుకోవడానికి,
సినిమాలకి వెళ్ళినప్పుడు కుడా గురయ్య రిక్షాలోనే వెళ్ళేవాళ్ళం.
సాయింత్రాలు నానగారిదగ్గర కుర్చుని ఏదో ఒకటి తెలుసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు.
నానగారంటే గురయ్యకి ఎంతో గౌరవం,మార్యాదాను.బాబుగారు అనే అనేవాడు.నన్ను కూడా చినబాబు మీరు అనే అంటాడు...నాకున్న చనువుకొద్దీ గురయ్య నువ్వు అనేస్తా నేను.
కొన్నిసార్లు మా స్నేహితుల రిక్షావాడు (రామయ్య) రాకపోతే మా ఫ్రెండ్స్ ని కూడా మా రిక్షలోనే ఎక్కించి తీసుకోచ్చేసేవాడు గురయ్య.
రామయ్యకి గురయ్యకి ఎప్పుడూ రిక్షాపోటీలే... ఎప్పుడూ గురయ్యదే గెలుపు...
ఎవరైనా బంధువులు ఇంటికోస్తున్నారంటే వాళ్ళని చూసే మొదటి వ్యక్తి గురయ్యే ఎందుకంటే కాంప్లెక్స్ కి వెళ్లి తీసుకోచ్చేవాడు తనే.తనకి మా ఇంటి బంధువులందరికీ సుపరిచితుడే.

కాలం అలా గడిచిపోతూ ఉంది.నేను కాలంతోపాటు ఎదుగుతూ 6వ తరగతికి వచ్చాను. అందరూ సైకిళ్ళ మీద వచ్చేవారు స్కూలుకి.
నానగారికి భయమేమో! నన్ను ఒంటరిగా సైకిల్ మీద పంపడానికి.అందుకే ఇంకా నేను స్కూలుకి రిక్షాలోనే వెళ్ళేవాడిని.మాకు వారానికి మూడు రోజులు స్పోర్ట్స్ పీరియడ్ కొత్తగా టైంటేబుల్లో
పెట్టారు.అందుకని రోజూ ఉదయం మాత్రమే గురయ్య రిక్షాలో సాయంత్రం నానగారు ఆఫీసునుండి
వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళేవారు.
హోంవర్క్స్ ఎక్కువై నేను నెలవారీ సామాన్లు తేవడానికి కూడా వెళ్ళడం మానేసా... ఎప్పుడైనా సినిమాకి దూరంగా ఉన్న సినిమాహాళ్ళకి వెళ్ళేటప్పుడు వచ్చేవాడు గురయ్య.అప్పుడు బేబి సీట్ నాది.
నేను చదువులో బిజీ అయిపోయా... అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్... నేను పరీక్షకి హాల్-టికెట్ తీసుకెళ్ళడం మర్చిపోయా. ఒక అరగంటలో తీసుకొస్తే పరీక్ష రాయడానికి పంపిస్తారన్నారు మా టీచర్...
పరీక్ష ఒక పూటే కావడం వల్ల గురయ్య ఇంకా స్కూలు బయటే ఉన్నాడు... ఇలా చెప్పగానే రిక్షాతీసి బయల్దేరి ఒక పావుగంటలో హాల్ టికెట్ తీసుకుని వచ్చేసాడు.చెమటలు కక్కుతూ ఉన్నాడు... పాపం అనిపించింది... గురయ్యకి థాంక్స్ చెప్పి నేను వెంటనే పరీక్ష రాయడానికి వెళ్ళిపోయా... సాయంత్రం చాక్లెట్ కూడా ఇచ్చా..
నానగారికి ఇదంతా చెప్తే నన్ను తిట్టారు.... అంతలా మరచిపోవడమేమి? మళ్ళీ గురయ్యని పంపడం ఎందుకు? అని అన్నారు.
గురయ్యని కూడా మందలించారు "ఎందుకు గురయ్య అంత తొందర?" అని...
పాపం చినబాబుని పరీక్ష రాయనివ్వరన్నారు బాబు అందుకని... అని నసిగాడు...
సరే సరే జాగ్రత్త అని నానగారు అనేసారు.
ఏమోయ్! సైకిల్ కొందామేంటి? మనవాడికి అన్నారు నాన్నగారు అమ్మతో.అమ్మ ఇప్పుడప్పుడే ఎందుకు? పరిక్షలయ్యాక కొనుక్కోవచ్చు అంది.
నేను సరే అని అన్నాను.ఆ తరవాతి రోజూ నుంచి నానగారే దింపారు స్కూలుకి.

గురయ్య ఓ వారం రోజులపాటు రాలేదు.గురయ్యకి ఏమయింది వారం రోజులనుంచి
కనిపించట్లేదు... ఊరు వెళ్ళాడా? అని నా పుస్తకాలు సర్దుకుంటూ అమ్మని
అడిగాను...
అమ్మ సమాధానం చెప్పలే...
నానగారు మాట్లాడలేదు...కొంచంసేపయ్యాక గురయ్యకి ఒంట్లో బాలే అన్నారు.
నేను దింపుతా అని బండి కిందకి దించారు...
ఈ లోపు రామయ్య వచ్చాడు.
నేను పలకరించాను... ఏం రామయ్యా! ఎలా ఉన్నావ్? ఏంటి సంగతులు?
మా గురయ్య ఏడి? ఎక్కడా పత్తా లేదు అన్నాను.
ఇంకెక్కడి గురయ్య బాబు? మీకు తెల్దా? గురయ్య...అన్నాడు.

నానగారు ఏదో సంజ్ఞలు చేస్తుండటం నేను చూసాను...
నాన్న గురయ్యకేమైంది అనడిగా...
గురయ్య చనిపోయాడు నాన్నా అన్నారు నానగారు....
నాకొక్కసారిగా ఏదో అయిపోయినట్టయింది .
నాకొక్కసారిగా ఏదో అయిపోయినట్టయింది .
ఏం తోచలేదు... ఏం చెయ్యాలో పాలుపోలేదు... ఒక్కసారిగా కోపం వచ్చింది నానగారి మీద...
నాకెందుకు చెప్పలేదు? వారంరోజులనుంచి ఒంట్లో బాలేదు అనేతప్ప. అని అలిగి స్కూల్ బ్యాగ్ లోపల పెట్టేసి ఓ మూల కూర్చున్నా... నాకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అప్పుడు.
అమ్మ నాన్న నా దగ్గరికోచ్చారు... ఊరుకో నాన్న... అని సముదాయించారు... అయినా ఏడుపు ఆగలేదు.
ఆ రోజంతా అదోలా గడిచింది. పాపం గురయ్య...
ఎంతో అలవాటైపోయాడు...
స్కూలుకి వెళ్తున్న దారంతా గురయ్యే గుర్తోచ్చేవాడు...
ఆ రిక్షా పోటీలు... సినిమాలకి వెళ్ళడం... సామాన్లకి వెళ్ళడం... అన్నీ కుడా...
ఎప్పటికీ మరచిపోలేను ఆ హాల్‌టికెట్ సంఘటన అయితే... ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతే గురయ్య పడ్డ కష్టమే గుర్తొస్తుంది...
కొందరు ఈ లోకంలో మనతో లేకపోయినా వారి జ్ఞాపకాలు అలానే నిలిచిపోతాయి.
అమ్మ నాన్న నా దగ్గరికోచ్చారు... ఊరుకో నాన్న... అని సముదాయించారు... అయినా ఏడుపు ఆగలేదు.
ఆ రోజంతా అదోలా గడిచింది. పాపం గురయ్య...
ఎంతో అలవాటైపోయాడు...
స్కూలుకి వెళ్తున్న దారంతా గురయ్యే గుర్తోచ్చేవాడు...
ఆ రిక్షా పోటీలు... సినిమాలకి వెళ్ళడం... సామాన్లకి వెళ్ళడం... అన్నీ కుడా...
ఎప్పటికీ మరచిపోలేను ఆ హాల్‌టికెట్ సంఘటన అయితే... ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతే గురయ్య పడ్డ కష్టమే గుర్తొస్తుంది...
కొందరితో ఉండేది కొంతకాలమైనా ఎంతో దగ్గరైపోతాము... ఎన్నో సంఘటనలు వాళ్ళతో జరిగినవి అలానే గుర్తుండిపోతాయి.
ఉన్న కాలాన్ని గొడవలతో, చికాకులతో కాకుండా మరువలేని మరచిపోని విధంగా గడపాలి.కొందరు ఈ లోకంలో మనతో లేకపోయినా వారి జ్ఞాపకాలు అలానే నిలిచిపోతాయి.
3 comments:
My childhood flashed before my eyes.
Wow....Really nyc....!!!
Good one ra..really nice. Keep going !!
Post a Comment