Monday, November 7, 2011

నేను-గీత, సైకిలు మీద...

ఉదయం లేచి ఆఫీసుకి వెళ్ళాలంటేనే భయమేస్తోంది...
ఈ గవర్నమెంట్ బళ్ళని బాన్ చేస్తే బావుండునేమో అనిపిస్తుంది కొన్నిసార్లు.
ఎంత పొల్యూషనో! ఆఫీసు టెన్షన్ వల్ల సగం జుట్టు ఊడిపోతుంటే... ఈ పొల్యూషన్ వల్ల ఇంకొంత జుట్టు ఊడిపోతోంది...
ఇదే మా ఊళ్ళో ఐతే ఇంత పొల్యూషన్ ఉండేది కాదు... ఎంత ప్రశాంతంగా ఉండేదో తెలుసా? చాలా అందమైన,ఆహ్లాదమైన వాతావరణం...
ఊరికి ఒక్క ఆర్.టి.సి బస్సు తప్ప వేరేమీ వచ్చేవి కావు...ఊళ్ళో ఉన్న బళ్ళు కూడా చాల తక్కువ... 
ఇప్పుడైతే 10th క్లాస్ పాస్ అవగానే బండి కొని పిల్లాడికి ఇచ్చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో సైకిలే చాలా గొప్ప.
కాలేజికి సైకిలు మీద వెళ్తూ ఉంటే ఆ త్రిల్లే వేరు.సైకిల్ అంటే నాకు నా కాలేజి రోజులు నా లవ్ స్టోరీయే గుర్తొస్తుంది.

నా కాలేజి రోజుల్లో ఐతే...
పొలాలగట్లమ్మట సైకిళ్ళతో నడుస్తూ ముందు అమ్మాయిలు వెనక మన కుర్రాళ్ళతో కలిసి వెళ్తుంటే...
ఆ ఎంజాయ్ మెంట్ అంతా ఇంతా కాదు...
ఇప్పటిలా చిన్న సైకిళ్ళు కాదు పెద్ద సైకిలు అంటారు కదా అది నేను వాడినది... దానికి ముందు లైటు కూడా ఉండేది.అదో పెద్ద యాక్సిసరి అప్పుడు.
సైకిలు వెనక క్యారేజికి పుస్తకాలు,డబ్బా...
ఊరి పొలాలు... గట్లు పుట్టలు చెట్లు సెలయేళ్ళు ఇలా అన్ని దాటుకుంటూ వంతెన మించి కాలేజీకి వెళ్ళే వాళ్ళం.

అది జూన్... కాలేజి మొదలయ్యే కాలం...కాలేజికి కొత్త కొత్తగా జాయిన్ అయినవారు మేము కలిసి వెళ్ళేవాళ్ళం సైకిళ్ళ మీద. కొందరు అమ్మాయిలు మాత్రం బస్సులో వచ్చేవారు కాలేజికి.కాలేజి స్టార్ట్ అయ్యి ఒక నెల అయింది... అన్నితెల్సిన మొహాలే... రొటీన్ అయిపొయింది...  ఒక రోజు ఓ అందమైన అమ్మాయి బస్సుదిగింది... పదహారణాల తెలుగమ్మాయి అంటారు కదా... అచ్చు అల్లాంటి అమ్మాయే దిగింది లంగా-వోణితో...

                                                                  వాలుజడ వయ్యారం...
లంగా-వోణి  సింగారం..
ఎవర్రా ఈ బంగారం??    
అని అడిగా బోసుగాడిని... బోసుగాడు నాకు చిన్నప్పటినుంచి మంచి ఫ్రెండ్...
గీత అని కొత్తగా వచ్చిందిరా... పోస్ట్ మాష్టర్ గారి అమ్మాయిట...
ఎవరు? మన ఊళ్ళో ఇంతకముందు పనిచేసారు... రాఘవయ్య అని... ఆయనేనా??
అవున్రా అన్నాడు...
  
మా నాన్నగారు మా ఊరి ప్రెసిడెంట్.గీత మా ఊరి పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి.తను నాకు చిన్నప్పటినుండి తెలుసు.నేను గీత కలిసి ఆడుకునే వాళ్ళం.
నేను ఏడవ తరగతి చదువుతుండగా రాఘవయ్యగారికి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు వేరే ఊరు వెళ్ళిపోయారు... తర్వాత మళ్ళీ కలవలేదు గీతని.అసలు నేను గుర్తున్నానో లేదో!?

అందరం క్లాసుకి వెళ్లాం...
నేను ఎందుకో గీతనే అలా చూస్తూ ఉన్నా...
"లవ్ ఎట్ ఫస్ట్ సైట్!" అంటే ఇదేనేమో అనిపించింది.నాలో నేనే నవ్వుకోవడం మొదలుపెట్టాను. బోసుగాడు నన్నే గమనిస్తూ ఉన్నాడు.. వాడికి అర్థమయినట్టుంది.

కాలేజి అవగానే అందరు బయలుదేరారు.నేను వెళ్లి గీతని పలకరిద్దాం అని అనుకున్నా...
తీరా నాకు గుర్తు లేదు అని గాలి తీసేస్తుందేమో గీత అని పలకరించలేదు.. తను బస్సెక్కి వెళ్ళిపోయింది.
నేను బోసు మా సైకిళ్ళ మీద ఇళ్ళకి బయల్దేరాం...

ఇప్పుడు తక్షణ కర్తవ్యం అన్నాను నేను?? బోసేమో గీత ఇల్లు తెల్సుకోవడం అన్నాడు...

ఒరేయ్ బోసు... గీత నాది... అని నేను మొదలుపెట్టేలోపే...
ఆపెయ్యరా...
నాకంతా తెలుసు...
నీ గురించే అన్నా గీత వాళ్ళిల్లు తెల్సుకోవాలని...

అరేయ్ మామ థాంక్స్ రా... ఇల్లు తెల్సుకోడానికి ఏముంది? పోస్ట్ మాష్టారి ఇల్లు...

అక్కడుండేది గీత కాదు సీత... రాఘవయ్యగారు రిటైర్ అయిపోయారు... ఇంక మన ఊళ్లోనే మకాం...
అవునా!? ఎగిరి గంతేయ్యాలని అనిపించింది నాకు...
వెంటనే ఊళ్లోకి వెళ్లాం...
ఆంజనేయస్వామి కోవెల వరకే బస్సు అక్కడినుంచి ఒక అరకిలోమీటరు ఊళ్లోకి నడవాలి...
గీత బస్సు దిగింది.. నేను బోసుగాడు గీతని ఫాలో అవుతున్నాం...
గీత అది గమనించి వెనక్కి తిరిగింది... బోసుగాడు మాత్రం సైకిలు మీద అలా ముందుకి పోయాడు..
నేను గీతకి దొరికిపోయా...

ఏంటి? ఫాలో అవుతున్నవా? అంది గీత.
ఊళ్లోకి ఇది తప్ప ఇంకే రూటు లేదు... అయినా నిన్ను నేను ఎందుకు ఫాలో అవుతా? నాకేంటి అవసరం? అని అడిగేసా...
పోరా బొండం అనేసి నవ్వుకుంటూ పరిగెత్తింది గీత...
నాకర్థం కాలే... పైగా కోపం వచ్చింది... (నేను చిన్నప్పుడు కొంచం బొద్దుగా ఉండేవాడిని... గీత నన్ను బొండం అనేది)
బొండం గీండం అంటే బావుండదు చెప్తున్నా అని అనే లోపే గీత వెళ్ళిపోయింది...
అంటే గీతకి ఇంకా గుర్తున్నాననమాట... నాలో సంతోషానికి అవధుల్లేవు...
బోసుగాడు గీతా వాళ్ళిల్లు ఎక్కడో కనిపెట్టేసాడు...

అలా రోజు ఉదయం,సాయంత్రం గీతని బస్టాప్ దాకా నేను గీత కలిసి వెళ్ళేవాళ్ళం...
గీత క్లాస్ టాపర్.. నేను పర్వాలే యావరేజ్ స్టూడెంట్ ని... అమ్మాయిలు అందరూ గీతతోనే ఉండేవారు... మాట్లాడటానికే అయ్యేది కాదు...  అలా ఫస్ట్ ఇయర్ అయిపొయింది... నేను గీత కొంచం క్లోజ్ అయ్యాం...
గీతకూడా కాలేజికి సైకిల్ మీద వస్తే బావుండు అని రాత్రి అనుకున్నా...
ఉదయం రెడీ అయ్యి నా సైకిల్ తీసే టైంకి గీత మా ఇంటి ముందు నుంచి  సైకిల్ బెల్ కొట్టుకుంటూ వెళ్తోంది...
నేను బయల్దేరా...
ఇద్దరం రోజు సైకిళ్ళ మీద అలా మాట్లాడుకుంటూ వంతెన దాకా వెళ్లి అక్కడ కొంచం సేపు ముచ్చట పెట్టి అప్పుడు క్లాసుకి వెళ్ళేవాళ్ళం...

ఒకరోజు గీత సైకిల్ పాచ్ అయింది...
కాలేజి బస్సు కుడా మిస్ అయితే బావుండు అని బోసుగాడికి చెప్పి బస్సు తొందరగా తీసేయ్యమన్నా...
ఫ్రెండ్ అంటే వాడే... నేను గీత ప్రేమకోసం ఎంత కష్టపడుతున్ననో వాడికే తెలుసు.
గీత బస్సు మిస్ అయింది... రా గీతా కాలేజీకే కదా! మనిద్దరం కలిసి వెళ్దాం... నీకేం అభ్యంతరం లేకపోతేనే అని నేను అన్నాను...
గీత వచ్చి ముందు కూర్చుంది... చల్లటి గాలి...
ఆ చల్లగాలికి ఈ పిల్లగాలి కుడా తోడైంది...
మొహమ్మీద ఆ గాలికి రెక్కలు కట్టుకు ఎగురుతున్నాయి తన ముంగురులు...
ఏదో సినిమాలో చెప్పినట్టు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అయిపొయింది...

ఎప్పుడూ కాలేజి చదువు తప్ప మా మధ్య ఇంకేం టాపిక్స్ రాలే... ఇప్పుడే కరక్ట్ టైం అని అనిపించింది...
గీతకి చెప్పేద్దామ? ఎలా రియాక్ట్ అవుతుందో!?  మళ్ళీ సాయంత్రం బస్సులో వెళ్ళిపోతుంది...
రోజు పాచ్ అయితే బావుంటుంది కానీ అలా జరగదు కదా!
ఏదైతే అది అని... సరే చెప్పేద్దాం అని సైకిల్ పక్కకి ఆపాను...
ఏంటి? నేను తోక్కనా సైకిల్ అంది గీత...
అది కాదు గీత.. అది... అది...
అది? ఏది?
నాకు నువ్వంటే చాలా ఇష్టం... "ఐ లవ్ యు" అని చెప్పేసా ధైర్యం చేసి...
పద... వెళ్దాం... క్లాసుకి టైం అయింది అనేసింది గీత...
ఇంతకీ ఒప్పుకున్నట్టా? కాదా? అన్నాను...
పద క్లాసుకి అంది...
మేమిద్దరం క్లాస్కి వెళ్ళిపోయాం...

జరిగినది బోసుగాడికి చెప్పా...
ఎన్ని సినిమాలు చూసావ్?
ఒక రోజాపువ్వు ఇచ్చి అయినా చెప్పొచ్చు కదరా...? అన్నాడు బోసుగాడు.
నాకు ఆ ఐడియా రాలేదు...
గీత మూడ్ అంతా మామూలుగానే ఉంది...
నేనే కొంచం డిస్టర్బుడ్ గా ఉన్నా అనిపించింది.
అస్సలు ఒక క్లాస్ కుడా వినలే... సాయంత్రం బోసు వెళ్దామా అన్నాడు... అమ్మాయిలందరూ బస్సు ఎక్కేసారు...
గీత నా సైకిల్ దగ్గరికి వచ్చి వెళ్దామా అంది...
బోసుగాడు ముందే వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ...
మధ్యలో గీత నాతో ఎం మాట్లాడలేదు...
ఆంజనేయస్వామి కోవెల వచ్చాక ఆపు అంది గీత.
ఇప్పుడు చెప్పు ఉదయం ఏదో చెప్పావ్ అంది...
గీత అది... నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నిన్నుమొదటి రోజు చూసిన దగ్గరనుంచి... నీ అలవాట్లు నే బిహేవియర్ నాకు నచ్చాయి...
ఐ అన్నాను...
ఐ లవ్ యు టూ! అంది గీత ...

నా ఆనందం ఇంతా అంతా కాదు... వెంటనే గీతని కౌగిలించుకున్నా...
కాలేజి నుండి ఆంజనేయస్వామి కోవెల దాకా గీత నాతో సైకిలు మీద వచ్చేది.
మా మీటింగ్ స్పాట్ అదే! అక్కడి నుంచి వాళ్ళింటికి నడిచి వెళ్ళేది.

తను ఒక రోజు కాలేజికి రాలేదు...
ఒకరోజు బండి మీద గీత... ముందు ఎవరో అబ్బాయి... ఆ అబ్బాయి నాకు తెలియదు కానీ చూడడానికి చిన్నపిల్లాడిలా ఉన్నాడు... కొంపతీసి గీతకి బావ అలాంటి రిలేషన్ కాదు కదా అనుకున్న మనసులో!

వాళ్ళ తమ్ముడుగిరీష్.. గిరీష్ నాకంతగా తెలీదు...బండి మీద దింపాడు మరుసటి రోజు...ఒక్క రోజే కదా అని నేను లైట్ తీసుకున్నా... మరుసటి రోజు కుడాఅదే అయ్యింది...
ఇంక రోజు మా తమ్ముడేనన్ను దింపుతాడు అంది గీత. నేనుసైకిల్ మీద వెళ్తాను అంటే నానగారువద్దన్నారు.

కొంపతీసి మీ తమ్ముడికి తెల్సిందా మన విషయం అని అడిగాను...ఏమో? నాకు తెలీదు అంది.
గీత వాళ్ళ తమ్ముడువాళ్ళ నాన్నగారికి చెప్పేసాడు...ఇంట్లో స్ట్రిక్ట్ చేసేసారు.గీత పరిక్షలు రాయడానికి తప్ప కాలేజికి రాదనీ సీత చెప్పిందనిబోసుగాడు చెప్పాడు.
దానితో నేను నేరుగా గీత వాళ్ళింటికి వెళ్లాను...గీతకి లెటర్ ఇవ్వడానికి కుడావీలు లేదు..

వెంటనే బోసుగాడిని బ్రతిమాలి సీత చేత గీతకి లెటర్ పంపించా...
  గీత లెటర్ చదువుతోంది...
                      గీతా నిన్నుచూడకుండా నేనుండలేకపోతున్నా...ప్రతి క్షణం ఒక యుగంలా ఉంది...ఈ విరహం నేను భరించలేకపోతున్నా..ఎన్నాళ్లని ఇలా వేచి ఉండను?మనం కన్న కలలన్నీ వృధాపోవడమేనా?నేను నిన్ను విడిచి ఉండలేను.మనంపెళ్లి చేసుకుందాం.నేను మా ఇంట్లోచెప్తా... నువ్వు కుడా మీ ఇంట్లోచెప్పి ఒప్పించడానికి ట్రైచెయ్.నీకు వీలయితే ఇవ్వాళ రాత్రి7 గం.లకి మన మీటింగ్ స్పాట్లోకలుసుకుందాం. 
గీత సరే అని చెప్పాననిచెప్పు అంది అని సీత బోసుగాడికిచెప్పింది.
బోసుగాడు నేనురాత్రి ఆంజనేయస్వామి కోవేలదగ్గరవెయిట్ చేస్తున్నాం.గీత రానేవచ్చింది...
బోసుగాడు పక్కకెళ్ళాడు...

గీత వచ్చావా..? ఎన్నాళ్లైందినిన్ను చూసి.. రా గీతా మనం పెళ్లిచేసుకుందాం! అన్నాను...

నువ్వంటే నాకూఇష్టమే.. మనం కలిసే జీవిస్తాం..
నేను ఇంట్లో అడగాలంటే ప్రెసిడెంట్గారి అబ్బాయి అంటే ఒప్పేసుకుంటారు...
కానీ నాకు అలా ఇష్టం లేదు...
నువ్వునన్ను నీ సంపాదనతో పోషించాలి.
నువ్వు నన్ను ఏంపెట్టి పోషిస్తావ్? అన్నదానికినాకు సమాధానం కావాలి...
గీత వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్నతో వచ్చాడు...
చేతి కర్ర తీసుకుని నా తల మీద గట్టిగా ఒకటి కొట్టాడు... రక్తం బొట బొట కారింది...
బోసుగాడు  వాడిని కొట్టబోయాడు... నేనే ఆపేసా...
గీతని వాళ్ళ నాన్న లాక్కుని తీసుకుపోతున్నాడు...

ఒక్కటి పీకుదామనుకున్నా వాడిని.... ఏరా! ఏమ్మట్లాడవే? అన్నాడు బోసుగాడు
నాకు గీత చెప్పింది నిజమే అనిపించింది...
నేను ఏం మాట్లాడలేక పోయా! నా సైకిల్ తీసుకుని అక్కడినుంచి వచ్చేసా...

నాకంటూ ఉన్నది నా సైకిల్ మాత్రమే... ఏం చెయ్యాలన్నాఈ ఊళ్ళో కుదరదు...
ఎందుకంటే మా నాన్నే ప్రెసిడెంట్..
ప్రెసిడెంట్గారి అబ్బాయి ఫలానా పని చేస్తున్నాడంటే ఇంట్లో భాగోతం అయిపోతుంది...
నా బుర్రకేంతట్టలే...
ఏం చేసినా పక్కవూళ్ళోనే... ఇక్కడెన్ని చేసినా మన పప్పులుడకవు..
ఇలా కాకపోతే మా నాన్నతో చెప్పేసి ఏదో ఒకటి మన ఊళ్లోనే చెయ్యాలి అన్నాను బొసుగాడితో...

అలాంటి టైం లో...పక్క ఊరిలో సైకిల్ పోటీలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది... నేను బోసుగాడు కలిసి బయల్దేరాం...

పోటీకి ఇంకా పది రోజులుంది... ఎక్కడెక్కడినుంచో వస్తారు... లాస్ట్ టైం నేను బోసుగాడు పోటీలు చూడటానికెళ్ళాం...
ఇంకా సైకిల్ పోటీలకి ప్రాక్టిస్ మొదలు పెట్టాను... ఎంత తక్కువ టైం లో ఎంత దూరం కవర్ చెయ్యగలం అనేదే ముఖ్యం...
పోటీరోజు రానే వచ్చింది...
పొటీదారులందరిని రెడీ  అవమన్నాడు....  గీత ఇంకా రాలే!
నా కళ్ళు గీతకోసమే వెతుకుతున్నాయి...
నాకు ఇప్పుడున్నదంతా  బోసుగాడు ఒక్కడే...
ఎలాగైనా పోటీలో గెలవాలి....
పచ్చ జెండా ఊపారు... అందరు బయల్దేరారు... నేను కుడా పెడల్ మీద కాలు పెట్టి రెడీగా ఉన్నా ...
గీత కనిపించింది.. నేను నెమ్మదిగా స్పీడ్ పెంచడం మొదలుపెట్టా...
మొత్తం ౨౪కి.మీ. ఊరి చుట్టూ తిరిగి ఎవరు తొందరగా చేరుతారో వాళ్ళదే గెలుపు...
ముందు సంవత్సరం గెలిచినవాడు రాజు... చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు... వాడిని ఓడిస్తే చాలు నేను నా గమ్యం చేరిపోయినట్టే...
ఈ పది రోజుల ప్రాక్టీసు చాల బాగా ఉపయోగపడింది... అనుకున్నట్టే రాజే నా మెయిన్ టార్గెట్...
ఫినిష్ లైన్ కి ఒక పావు కి.మీ. దూరంలో ఉన్నాం రాజు నేను...
అలసిపోయినట్టైపోయింది.. శక్తి క్షీనిస్తోంది... కాని ఇది నా జీవిత సమస్య...ఎలా ఐన గెలవాలి అన్న తపనతో తొక్కుతున్నా...
నేను ఫినిష్ లైన్ దాటేసా... వెనక్కి తిరిగి చూస్తే రాజు నన్ను అభినందిస్తూ కనిపించాడు...
రాజు దెగ్గరికి వెళ్లి నువ్వు కావాలని నన్ను గెలిపించావ్ కదా రాజు అన్నా నేను... రాజు నవ్వి స్నేహం ప్రేమ ఎప్పుడు ఓడిపోవు అన్నాడు.. వెంటనే రాజుని హత్తుకుని షేక్ హ్యాండ్ ఇచ్చా...  బోసుగాడి ఆనందమే ఆనందం...
వచ్చిన డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకున్నా...
పెద్దలతో చెప్పి పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాం నేను గీత...

మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకున్నారు ఇద్దరం చదువులు పూర్తి చేసుకుని సెటిల్ అయ్యాం.
హ్యాపీ లైఫ్ ఇంక...
గుణవతి అయి నేనూ మీ వెంటే అని ఉండే భార్య, అన్ని వేళల్లో సహాయపడే ఒక మిత్రుడు చాలు మంచి జీవితం  గడపడానికి...

ఇంక పొల్యూషన్ విషయానికొస్తే...
ఆ రోజు నా సైకిలే లేకపోతె నా పరిస్థితేంటి? అమ్మో! ఆ ఆలోచనే వద్దు...దాని వల్ల అసలు కాలుష్యమే లేదు..
పైగా ఒంటికి మంచి ఎక్సర్సైజ్ కూడాను...
ఈ కాలుష్యం వల్ల ప్రజలు ఎంతో అనారోగ్యం పాలవుతున్నారు ...
మనకి కనీసం ఆక్సిజన్ పీల్చడానికి ఉంది... కొన్నాళ్ళు పోయాక గాలికోసం ఆక్సిజన్ సిలిండర్లు వాడాలేమో..!
అందుకే కాలుష్యాన్ని పెంచే వాహనాల వాడకం తగ్గించాలి...
అలా చేయడం వల్ల 
మన తరువాతి తరాలకి కుడా మంచి ప్రకృతిని ఇచ్చినవాళ్ళం అవుతాం...



Saturday, November 5, 2011

కోటి విద్యలు... కూటి కొరకా? కోటి కొరకా?

"రెక్కాడితే కానీ డొక్కాడదు" అని... 
ఎంత రెక్కలు ఆడించినా... డొక్కాడాలంటే సంపాదించాలి...
సంపాదన కోసం మనం ఎంతో కష్టపడతాం... 
రాత్రింబవళ్ళు కష్టపడి నెలంతా పని చేసేది నేలాఖరున వచ్చే జీతం కోసమే...
అన్ని రోజులు కష్టపడ్డ కష్టం అంతా ఆ ఒక్క రోజుతో పోయినట్టు అనిపిస్తుంది.
మళ్ళీ జీతం తీసుకోవాలంటే ఇంకో నెల గడవాలని  అనుకుంటే మాత్రం...
అబ్బా! ఇంకో నెల పనిచెయ్యాలా? అని అనుకుంటాం.

అదేదో సినిమాలో చెప్పినట్టు అక్కడినుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడి నుంచి అక్కడికి కూడా అంతే దూరం కదా!

ఇంజనీరింగు చేసినా ఇంట్లో కూర్చున్నా ఆకలి ఆకలే...
ఆకలికి తెలిదు కదా మనం ఎవరమో ఏంటో అని...? తెల్సినా పెద్దగా చేసేదేం లేదు..
పాపం దాని పని అది చేసుకుపోతుంది...                

మనం ఏం చేసినా ఎన్ని చేసినా పోట్ట నింపుకోటానికే...
అందుకే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు...
ఎంత డబ్బు-దస్కం ఉన్నా పరువు-పలుకుబడి ఉన్నా ఎంత గొప్పవాడైన ఆకలి ఎవడికైనా ఆకలే!

                 మనకి ఎంత సంపాదించినా తనివి తీరదు.ఉన్నదానితో సంతృప్తి చెందితే మనం మనుషులం ఎందుకౌతాం? పైగా "ధనమూలమిదం జగత్" అని మనకి ఉండనే ఉంది కదా...! పైగా ఎన్ని నేర్చుకున్నా అది సంపాదనకే అయిపోతోంది... కోటి విద్యలు కోటి కొరకే అయిపోతున్నాయి... 

ఈ లోక్పాల్ బిల్ అది ఇది అన్ని ఎన్ని వచ్చినా మన లోకం మనదే... మారదే!
హిట్లర్ లాంటి వాడు వచ్చినా సరే ఏమి చెయ్యలేడు... అందరు డెమోక్రసీకి అలవాటు పడిపోయారు...

ముఖ్యంగా మన దేశంలో ఐతే అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి కనుక!
 ఏ పని జరగాలన్నా డబ్బు ముట్టితేకాని అవదు... దానికే  కొన్నిచోట్ల గిఫ్ట్ అని పేరు...
గిఫ్ట్లు వస్తే కాని పనులు జరగవు...

ఎంత కష్టపడినా తిండి సంపాదించడానికే కాని డబ్బుకోసం కాదు...
పూర్వం అంటే... ఈ నాణాలు ముద్రించక ముందు... వరహాలు వజ్రాలు ఇలా ఉండేది కొలమానం... అంతకముందు పశుసంపద ఎంత ఉంటే వాడు అంత ధనవంతుడు... ఇదంతా పోయి... నోట్ల,నాణాల ముద్రణ వచ్చాక మరీ డబ్బు మత్తులో పడిపోయింది ప్రపంచం.
బ్రతకడం కోసం తినడం కాని తినడం కోసం బ్రతకడం కాదు...
జీవితం కేవలం డబ్బు సంపాదించడమే కాదు ఇంకా ఎన్నో, ఎన్నెన్నో సంపాదించాలి,అనుభవించాలి అన్న ఆలోచన ఉన్నవాళ్లు  చాలా గొప్పవాళ్ళు అయ్యారని మనకి తెలుసు.

అలా అని డబ్బు సంపాదించొద్దు అని కాదు... ఏదైనా మితంగా ఉంటేనే బావుంటుంది.
కాని డబ్బు ఎవరికి చేదు చెప్పండి...?
అందరికి డబ్బు కావాలి... ఏం ఇచ్చినా వద్దనే వాళ్ళు ఉంటారు కాని డబ్బు బంగారం ఇలాంటివి వద్దనే వాళ్ళుండడమే చాల అరుదు...

ఒక రెండు రోజులు వరసగా ఇడ్లీ టిఫిన్ చేస్తే రోజు ఈ చెత్త ఇడ్లీయేనా అంటాం...
మొదటి రోజు బంగాళదుంప వేపుడు ఎంతో ప్రీతితో తింటాం రెండవరోజు కుడా అదే ఐతే పర్వాలే కానీ మూడవ రోజున బంగాళదుంపవేపుడు చేస్తే ఇల్లంతా గోల గోల చేసేస్తాం...
రోజూ ఇదేనా? ఇంకేం కూరల్లెవా? అని గెట్టిగా కేకలేస్తాం. నేను తినను అని అలుగుతాం...
ఎంతో ఇష్టమని అమ్మ మనకోసం చేస్తే మనమేమో రోజు ఇదే అని వదిలేస్తాం... అదే డబ్బైతే??
ఎంత ఇచ్చినా మనం తీసుకుంటూనే ఉంటాం...

ఏదో అవసరమై నాన్నగారిని ఓ 10 రూపాయిలు అడిగి తీసుకున్నామనుకోండి... 10 అంటే పదేనా ఇంకో పదివ్వోచు కదా?? సంపాదించేది ఖర్చుపెట్టడానికే కదా? ఏం చేసుకుంటారు? మాకోసమే కదా అంతా అనుకుని ఉంటాం చిన్నప్పుడు... సంపాదిస్తే కానీ దాని విలువ మనకి తెలియదు.

కొన్ని లక్షలు సంపాదించాలి అని నాకున్న ఆశల్లో ఒకటి...
నా చిన్నప్పుడు మా నాన్నగారు ఆఫీసునుంచి రాగానే రొజూ అడిగేవాడిని డాడీ ఓ కోటి తెచ్చారా? అని...
మా నానగారు సరదాగా... చాకలాడికి వేసాను రేపు తెస్తాడు అనేవారు...

ప్రతి ఆశకి ఓ హద్దు ఉంటుంది.హద్దు మీరిన ఆశలు ఆకాశాన్ని అంటుకోవడం మొదలుపెడితే  కష్టాలు మొదలైనట్లే... ఆశ అత్యాశ కాకూడదు...
ఒక పది రూపాయిలు సంపాదించాక ఇంకో పది... వంద... వెయ్యి... లక్షలు... కోట్లు... ఇలా.... సంపాదన పెరగాలనే మనిషి ఉబలాట పడతాడు.
నాకున్నది చాలు... అని సంత్రుప్తిపడే వాళ్ళు ఉండటమే చాల తక్కువ.

మనం అనుభవించడానికే కొన్ని లేవు. ఆ హిస్టరీ బుక్స్ తిరగేస్తే కాని కొన్ని తెలివు మనకి...
అలా మిగిలినది అంతా మనమే అనుభవిస్తే మన భావితరాలకి మనం మంచి ప్రకృతిని కూడా ఇవ్వలేం...
పాపం వాళ్ళు ఏ ట్యాబుల్లోనో నోటుల్లోనో గూగుల్ సెర్చ్ చేసి చూసుకోవాలి... ఇలా ఉండేదంట అప్పుడెప్పుడో అని...
తినడానికి మంచి తిండిని కుడా ఇవ్వలేం... ఇప్పటికే పిజ్జా అని బర్గర్ అని... బ్రెడ్ బటర్ జాం అని... వీటికే అలవాటు పడిపోతున్నారు... కొన్ని కూరల పేర్లే తెలివు కొందరికి...

నేను సంపాదించింది నాది అని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అది ఇంకొకళ్ళకి చెందుతుంది అది.
ఉన్నంతకాలం డబ్బు సంపాదించి... సంపాదించి... పోయాక వారి పిల్లలు సుఖంగా అనుభవిస్తారు అనుకోడానికి కుడా లేదు... పిల్లలు వారి పిల్లలకి వారి పిల్లలు వారి పిల్లలకి... ఇలా సాగిపోతూనే ఉంది...
వంశపారపర్యం అయిపోతోంది... అన్ని రంగాల్లోనూ...
పక్కవాడికి అవకాశం దొరకనివ్వకుండా ఉన్న డబ్బుతో ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు...
ఏమైపోతోందో ఈ లోకం...?

సంపాదన అనేది సంతోషాన్ని ఇవ్వాలి... సంపాదనని కాపాడుకోవాలి అని భయంతో బ్రతుకుతున్నంత కాలం ఆ జీవితం వ్యర్ధమైంది...
విద్య వినయాన్ని ఇస్తుంది... బ్రతికుతున్నంతకాలం ఎంత వినయాన్ని సంపాదిస్తామో అది అసలైన సంపాదన...
మన దేశంలో మనకి తెలియని విద్యలు చాలా ఉన్నాయి... మన పూర్వీకులు గ్రంధాలలో నిక్షిప్తం చేసి ఉంచారు..
వాటిని వెలుగులోకి తెచ్చి... అందరికీ ఉపయోగ పడేలా చెయ్యాలి... ఎన్నెన్నో విద్యలు నేర్చుకోవాలి...
  
వీలైనన్నిటిని నేర్చుకుందాం... మంచికే ఉపయోగిద్దాం... భావితరాలకు మంచి సంస్కృతిని, ప్రకృతిని  అందిద్దాం.

Friday, November 4, 2011

understanding a person...?

One of my friends promised me for an outing and missed it as he has an appointment with his girl...
He said... Dude! Hope you can understand me...
I said thats ok.. you carry on...
Got bored...
Thought someone may join me and made a cal to another friend...
she is busy with her work and stated the same statement... you can understand me na buddy...
Few such incidents lead me to think on "understanding"
why does everyone say understand me??
what exactly does this 'understand me' mean??
Do we really understand a person?
if yes how? if not why?

No one can really understand another person.
I would say understanding a person is not true for 99%...

Human thinking varies from time to time...
As all of us(humans) are gifted with a dangerous organ called brain, which has the ability to think and which helps one in differentiating things from one another and this is that thinking which keeps on tuning our brain inturn changing the focus of mind from from one to the other.
Change in the focus is because of the intervention of human with nature...
There exists a beautiful relationship between nature and human.
The human mind thinks that nature is never still.As one moves from place to place,nature changes...
wet rainy forests changes to deserts, cloud icy mountains turns into vast oceans.Even one sits in a place observes nature changing with time.Plants wither and die,animals migrate, seasons change,sun sets and rises,moon waxes and wanes.Everything born evantually dies.
Nature is made to be like whatever and however it can..
But it is human mind that is not still...
One can never reach others expectations to the full.Better way is to experience the person.
It is difficult to depict that one behaves like this or like that in a particular sitaution.
But one can get used to the behaviour of the other person,so that that helps him in understanding the his behavior in that situation.
Things vary from person to person and time to time...
what was right in the past may be wrong in the future.
what was good in one part may be bad in the other.
what one person find beautiful may be ugly to the other...

It is the situation that one should understand and behave... I call it as a smart work...
Situations often comes here and there and people act according to it in different ways...
If situatuion demands... we have to do anything which may even be out of our scope...
One can easily figure it out that he who understood the situation and behaved succeeded in life...

If you call it understanding a person, then...
Understanding a human requires one to be at a higher frequency to the one who he is trying to understand.
whenever two persons are speaking there exists a frequency for each person... this can be called as  natural frequency... which may be same for two or more...
Sometimes we say our tastes matches...
Same pinch,Great minds think alike and all that stuff...
This is what exactly happens...

Your thinking frequency matches with that of the other guy so that you both think alike...
That is why if you stuck with a problem you get many ideas from others than yourself as they think beyond your frequency range...

That is why for manythings, we approach a greater person who can see things beyond what we can...

Right from ages and puranas the tradition of Marriage between two persons is made in such a way that husband is elder to wife...
This helps the husband to understand the wife as he is experienced and has an exposure to many things.. so that they lead a happy life together.
One who is experienced can understand things in a better way...

So experience the experienced...

Experience certainity ;)

Thursday, November 3, 2011

మా రిక్షా గురయ్య...

అమ్మా! ఎంతసేపమ్మా? స్కూల్కి టైం అయిపోతోంది... క్యారేజ్ పెట్టు తొందరగా...
రోజూ ఇదే గోల ఇంట్లో. . .
అమ్మ ఎంతకీ క్యారేజ్ పెట్టదు,నానగారి పేపర్ చదవడం అవదు. నాకేమో స్కూలుకి టైం అయిపోతుంది.


నాకస్సలు అర్థం కాదు అంత పెద్ద పేపర్ ఎందుకు తయారు చేస్తారో?
అదేదో మా సోషల్ టెక్స్ట్ బుక్ పజీలన్నే విడిగా తీసి అతికించినట్టు ఉంటుంది. నాకస్సలు నచ్చదు పేపర్ చదవడం. కానీ నానగారు మాత్రం రోజూ చదివేస్తూనే ఉంటారు. పైగా నన్ను కుడా చదవమంటారు.
నేను స్నానం చేసి,దేవుడికి దణ్ణం పెట్టి, బుక్స్ సర్దుకునే వరకు అలా చదువుతూనే ఉంటారు.అదే టైంకి గురయ్య వచ్చేస్తాడు...
గురయ్య రిక్షాబెల్ కొడుతూనే ఉంటాడు... అప్పటిక్కానీ నాకు క్యారేజ్ ఇవ్వదు అమ్మ.
గురయ్య ఇంకా రాలేదు కదా? అంటుంది అమ్మ.


గురయ్యా.... గురయ్యా... అని నేను పిలిస్తే గురయ్య పలికేదాకా క్యారేజ్ ఇవ్వదనమాట.
అదిగో గురయ్య బయటే ఉన్నాడు... క్యారేజ్ ఇస్తే నేను స్కూలుకి వెళ్ళొస్తా అమ్మా...


గురయ్యేమో... బాబు... మీదే లేటు.. స్కూలుకి టైం అయిపోనాది... అందరూ వచ్సారు... మీరోస్తే స్కూల్కి పోడమే!


మా స్కూలు మా ఇంటినుంచి ఓ 3 కి.మీ. దూరం ... మా ఇంటి ముందే సినిమా హాలు... సినిమా పోస్టర్లు చూస్తూ అలా అందరితో గోల గోల చేస్తూ రిక్షాలో వెళ్ళేవాడిని స్కూలుకి.
రోజూ ఉదయం సాయంత్రం కూడా రిక్షాలోనే స్కులుకెళ్ళి ఇంటికి వచ్చేవాడిని.
గురయ్యకి కుదరకపోతే నానగారు అప్పుడప్పుడు ఆయన లూనామీద దింపేవారు.
రిక్షా ఎక్కిన దగ్గర నుంచి స్కూలుకి దింపేవరకు అలా మాట్లాడుతూనే ఉండేవాడు గురయ్య.


గురయ్య నాకు చిన్నప్పటి నుండి తెలుసు.
నన్ను స్కూల్కి దింపడమే కాదు... ఉదయం పూజకి పూలు తెచ్చేవాడు, నెలవారీ సామాన్లు తెచ్చుకోవడానికి, సినిమాలకి వెళ్ళినప్పుడు కుడా గురయ్య రిక్షాలోనే వెళ్ళేవాళ్ళం.
సాయింత్రాలు నానగారిదగ్గర కుర్చుని ఏదో ఒకటి తెలుసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు.


నానగారంటే గురయ్యకి ఎంతో గౌరవం,మార్యాదాను.బాబుగారు అనే అనేవాడు.నన్ను కూడా చినబాబు మీరు అనే అంటాడు...నాకున్న చనువుకొద్దీ గురయ్య నువ్వు అనేస్తా నేను.


కొన్నిసార్లు మా స్నేహితుల రిక్షావాడు (రామయ్య) రాకపోతే మా ఫ్రెండ్స్ ని  కూడా మా రిక్షలోనే ఎక్కించి తీసుకోచ్చేసేవాడు గురయ్య.
రామయ్యకి గురయ్యకి ఎప్పుడూ రిక్షాపోటీలే... ఎప్పుడూ గురయ్యదే గెలుపు...
ఎవరైనా బంధువులు ఇంటికోస్తున్నారంటే వాళ్ళని చూసే మొదటి వ్యక్తి గురయ్యే ఎందుకంటే కాంప్లెక్స్ కి వెళ్లి తీసుకోచ్చేవాడు తనే.తనకి మా ఇంటి బంధువులందరికీ సుపరిచితుడే.
కాలం అలా గడిచిపోతూ ఉంది.నేను కాలంతోపాటు ఎదుగుతూ 6వ తరగతికి వచ్చాను. అందరూ సైకిళ్ళ మీద వచ్చేవారు స్కూలుకి. 
నానగారికి భయమేమో! నన్ను ఒంటరిగా సైకిల్ మీద పంపడానికి.అందుకే ఇంకా నేను స్కూలుకి  రిక్షాలోనే వెళ్ళేవాడిని.మాకు వారానికి మూడు రోజులు స్పోర్ట్స్ పీరియడ్ కొత్తగా టైంటేబుల్లో పెట్టారు.అందుకని రోజూ ఉదయం మాత్రమే గురయ్య రిక్షాలో సాయంత్రం నానగారు ఆఫీసునుండి వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళేవారు.
హోంవర్క్స్ ఎక్కువై నేను నెలవారీ సామాన్లు తేవడానికి కూడా వెళ్ళడం మానేసా... ఎప్పుడైనా సినిమాకి దూరంగా ఉన్న సినిమాహాళ్ళకి వెళ్ళేటప్పుడు వచ్చేవాడు గురయ్య.అప్పుడు బేబి సీట్ నాది.


నేను చదువులో బిజీ అయిపోయా... అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్... నేను పరీక్షకి హాల్-టికెట్ తీసుకెళ్ళడం మర్చిపోయా. ఒక అరగంటలో తీసుకొస్తే పరీక్ష రాయడానికి పంపిస్తారన్నారు మా టీచర్...
పరీక్ష  ఒక పూటే కావడం వల్ల గురయ్య ఇంకా స్కూలు బయటే ఉన్నాడు... ఇలా చెప్పగానే రిక్షాతీసి బయల్దేరి ఒక పావుగంటలో హాల్ టికెట్ తీసుకుని వచ్చేసాడు.చెమటలు కక్కుతూ ఉన్నాడు... పాపం అనిపించింది... గురయ్యకి థాంక్స్ చెప్పి నేను వెంటనే పరీక్ష రాయడానికి వెళ్ళిపోయా... సాయంత్రం చాక్లెట్ కూడా ఇచ్చా..
నానగారికి ఇదంతా చెప్తే నన్ను తిట్టారు.... అంతలా మరచిపోవడమేమి? మళ్ళీ గురయ్యని పంపడం ఎందుకు? అని అన్నారు.
గురయ్యని కూడా మందలించారు "ఎందుకు గురయ్య అంత తొందర?" అని...
పాపం చినబాబుని పరీక్ష రాయనివ్వరన్నారు బాబు అందుకని... అని నసిగాడు...
సరే సరే జాగ్రత్త అని నానగారు అనేసారు.


ఏమోయ్! సైకిల్  కొందామేంటి? మనవాడికి అన్నారు నాన్నగారు అమ్మతో.అమ్మ ఇప్పుడప్పుడే ఎందుకు? పరిక్షలయ్యాక కొనుక్కోవచ్చు అంది.
నేను సరే అని అన్నాను.ఆ తరవాతి రోజూ నుంచి నానగారే దింపారు స్కూలుకి.
గురయ్య ఓ వారం రోజులపాటు రాలేదు.గురయ్యకి ఏమయింది వారం రోజులనుంచి కనిపించట్లేదు... ఊరు వెళ్ళాడా? అని నా పుస్తకాలు సర్దుకుంటూ అమ్మని అడిగాను...
అమ్మ సమాధానం చెప్పలే...
నానగారు మాట్లాడలేదు...కొంచంసేపయ్యాక గురయ్యకి ఒంట్లో బాలే అన్నారు.
నేను దింపుతా అని బండి కిందకి దించారు...


ఈ లోపు రామయ్య వచ్చాడు.
నేను పలకరించాను... ఏం రామయ్యా! ఎలా ఉన్నావ్? ఏంటి సంగతులు?
మా గురయ్య ఏడి? ఎక్కడా పత్తా లేదు అన్నాను.
ఇంకెక్కడి గురయ్య బాబు? మీకు తెల్దా? గురయ్య...అన్నాడు.
నానగారు ఏదో సంజ్ఞలు చేస్తుండటం నేను చూసాను...
నాన్న గురయ్యకేమైంది అనడిగా...
గురయ్య చనిపోయాడు నాన్నా అన్నారు నానగారు....
నాకొక్కసారిగా ఏదో అయిపోయినట్టయింది .
ఏం తోచలేదు... ఏం చెయ్యాలో పాలుపోలేదు... ఒక్కసారిగా కోపం వచ్చింది నానగారి మీద...
నాకెందుకు చెప్పలేదు? వారంరోజులనుంచి ఒంట్లో బాలేదు అనేతప్ప. అని అలిగి స్కూల్ బ్యాగ్ లోపల పెట్టేసి ఓ మూల కూర్చున్నా... నాకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అప్పుడు.
అమ్మ నాన్న నా దగ్గరికోచ్చారు... ఊరుకో నాన్న... అని సముదాయించారు... అయినా ఏడుపు ఆగలేదు.


ఆ రోజంతా అదోలా గడిచింది. పాపం గురయ్య...
ఎంతో అలవాటైపోయాడు...
స్కూలుకి వెళ్తున్న దారంతా గురయ్యే గుర్తోచ్చేవాడు...
ఆ రిక్షా పోటీలు... సినిమాలకి వెళ్ళడం... సామాన్లకి వెళ్ళడం... అన్నీ కుడా...
ఎప్పటికీ మరచిపోలేను ఆ హాల్టికెట్ సంఘటన అయితే... ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతే గురయ్య పడ్డ కష్టమే గుర్తొస్తుంది...


కొందరితో ఉండేది కొంతకాలమైనా ఎంతో దగ్గరైపోతాము... ఎన్నో సంఘటనలు వాళ్ళతో జరిగినవి అలానే గుర్తుండిపోతాయి.
ఉన్న కాలాన్ని గొడవలతో, చికాకులతో కాకుండా మరువలేని మరచిపోని విధంగా గడపాలి.


కొందరు ఈ లోకంలో మనతో లేకపోయినా వారి జ్ఞాపకాలు అలానే నిలిచిపోతాయి.


     



Saturday, October 29, 2011

यद् भावं तद भवति...



కలలు కనండి.... సాకారం చేసుకోండి.. అని ఎవరో మహానుభావుడు అన్నాడు.
ఆయన కలలు సాకారం చేసుకోమ్మని అంటే మనవాళ్ళు అలా కలలు కంటూనే ఉన్నారు... పైగా కలలు రావాలంటే ఎక్కువ సేపు నిద్రపోవాలి అని 'కలలు కనండి' అన్నదానిని నిర్వచించి చాలామంది అదే పనిగా పడుక్కుంటున్నారు.
పడుక్కుంటే పడుక్కున్నారు... ఏం కలలు కంటున్నారో ఎంతమంది సాకారం చేసుకుంటున్నారో...? 
మనకి తెలియకపోయినా వారికి  తెలిస్తే చాలు.

ఈ పోటీ ప్రపంచంలో కొంతమందికి నిద్రే కరువైపోతోంది.
పని వత్తిడి వల్ల ఇంటికి చేరక ఆఫీసులోనే నిద్రపోతున్నవాళ్ళు కూడా ఉన్నారు కదా!
సుఖంగా నిద్రపోయా అని అన్నవాళ్ళూ లేకపోలేదు కానీ కంటినిండా కునుకు తీసి చాలా రోజులయిందిరా అబ్బాయ్! అన్నవాళ్ళే ఎక్కువ.

చాలామందికి రాత్రి సుఖంగా నిద్ర పట్టదు... ఏవేవో కలలు... కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి... కొన్ని  చెప్పుకునేవి ఇంకొన్ని చెప్పుకోలేనివి...
కొన్నిసార్లు పాడు కలలు వస్తే ఠక్కుమని నిద్రలోంచి లేచి కూర్చుంటారు... ఉలిక్కి పడుతుంటారు...
మంచి కలలు వస్తాయని  పక్క దిగని వాళ్ళు కుడా ఉన్నారు.

కొన్ని కలలు చాల అందంగా ఉంటాయి... ఏ లక్షాదికారిగానో.. దేవకన్యలతోనో... నచ్చినవాళ్ళతోనో... ఇష్టమైన వస్తువుతోనో,ఇష్టమైన ప్రదేశంలోనో... ఇలా నచ్చినవి చాలా ఉంటాయి...

కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనలో చాలామందికి ఇలా అనిపించి ఉండొచ్చు...

అరె! ఇదెప్పుడో అయిపోయిందే... కాని మళ్ళీ ఇప్పుడెందు మళ్ళీ జరుగుతోంది? అని...
మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరాల్లో మతిమరపు ఒకటి.

అయినవన్నీ గుర్తుంచుకుంటే ఇంకేమైనా ఉందా??
లోకమంతా పిచ్చేక్కిపోతుంది... జంబలకడిపంబ అయిపోతుంది...

కలకి ఊహకి చాలా దగ్గర సంబంధం ఉంది... ఎక్కువగా ఊహించుకుని రోజంతా అదే ఆలోచిస్తూ ఉంటే రాత్రి కలలో కుడా అదే వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయని మన శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఊహ,కల మనసుతో ముడిపడి ఉంటాయి... మిగిలిన జంతువులకి మనిషికి తేడా ఇక్కడే.. మనిషికి ప్రకటించే శక్తిని ఇచ్చాడు... అది వాక్కు ద్వారా అయినా సరే వ్రాత ద్వారా అయినా సరే...

మనం మనసులో ఏమనుకుంటే అది అదేవిధంగా జరిగితే?? కన్నకలలు, ఊహలు నిజమైతే??
మనం ఎలా భావిస్తే అది అలా జరిగితే?

ఒక కథ సాక్షాత్కరిస్తుందేమో??
to be continued... 

One Lucky day it happend like that...

I awoke to the savage beeping of my alarm in my mobile @ 4:30 in the morning. I whip out blindly with my arm until I find it and then threw it into bloody submissive silence. I roll over and started to drift back off to sleep. I lay there for what seems like forever and yet I cant get back to sleep... This is my daily activity to get up from the bed... though this is a routine i am used to it...

With a sour moan I drag myself out of bed and into the bathroom, while brushing my teeth. I jerk awake, I had fallen asleep standing before the washbasin brush being in my mouth and heard some messy noise very louder near to  my place... it seemed as if someone is quarelling. Confused I walked down the hall to the front door after a face-wash.

I opened the door and peered out cautiously. It was still dark out and you could see the faint glow of dawn on the horizon. I blinked a bit clearing the sleep out of my eyes. I shook my head a bit, trying to get the image I was seeing out of my head.
Standing far from me are two guys... they are quite possibly someone i had ever seen in this area... because most of the faces and figures are well know to my eyes...They are stepping towards my place...
Still i cannot see the clear image of those guys...what all i can see is one guy holding a cigar in his hand and the smoke is coming out like that of a smoke oozing out from an engine of a train that runs with coal...
No one woke up except  myself....  probably these guys must have been observing me since a long time...

As mine is the only opened door in the whole colony... they came nearer to my place... I was awaiting whats gonna happen? These faces are unknown to me.. Having heard that people are getting robbed still I kept my door opened.

A thought went in my mind as one can see in a typical Indian movie... Whatever hero does that goes well... I thought like there is gonna be an action scene for few minutes and at-last  these guys will be taken in an ambulance of a Govt. Hospital... I can see the slideshow of my favorite action hero's brooslie & JackieChan being played...
Suddenly I felt a paining cheek.. I was rubbing my cheek and it did not take much time for me to realize that I am on the floor and its from the floor i am trying to wake up...
I was not given a chance to speak...they zipped my mouth with a plaster... they searched all around the house but they found none as I was single and staying far from my family...
Fortunately or Unfortunately my cousin was not there with me on that day... He visits me on every weekend...
Luckily i was made to sit on the couch in the hall... which is one of my favorite places... I do love the place for watching movies sleeping on it...
One of these guys switched on the tv...
It was set to the channel Zoom and now Katrina kaif's item song sheela sheela ki jawani is on it...
The guy who was handling the remote started pressing the plus symbol of volume button on the remote and  started increasing the volume...
The other guy shouted at him to switch off the tv and this guy replied like... people around may think that this fellow has switched on the tv and no one can suspect us...
I thought of appreciating for his idea or atleast i wanted to say... what an idea? sirji...
He kept the volume a bit low and they started discussing...

Manythings went on in my mind...
Are they planning to kidnap me or something like that? or will they steal money or some of my possessions?
I generally don't have a habit of keeping my money in my room or i never let my wallet full...
Banks are there to take care of Money...
As my dad is a bank manager, I have a positive look over banks...
I have a habit of collecting currency from different countries... He might find only few as i gifted most of them to my dad on his Birthday.
So they have no option to take money or valuable possessions from me.If at all they find debit-cards,they may ask me to give the pin... atleast for that they have to open my mouth... once if they unzip my mouth no one can stop me...i can  manage....
Meanwhile I heard the guy saying We'l take this sharma to our room... and you get the breakfast for him then we can take him to the marriage at the temple.

I did not understand... about who are they talking to? I wanted to question them...
Isnt that for money you are doing this?? gimme a chance to speak...
Sharma is a general word that can be used for a brahmin.
Do they want me to read those sacred mantras for a marriage? then I am not the one they are searching for...
Are they from Bhajarangadal or shivasena so that they wanted me to get my married to someone?
I am not ready and i never followed a girl and if yes is the case no one has seen it...

Suddenly they turned towards me and showed a pic...
It is a pic of a girl,who might be around 20 yrs...
A Photographer in me woke-up... and he started analysing the photo...
The pic was taken in close-up.. might be in a photo studio.. for a marriage...
small editings in the photoshop may help look this beauty more beautiful...
They have removed the plaster that they stick to my mouth...
They asked me about the gir... I said I neither know this girl and no other detials I can give you as i have not seen her before but...
they are staring at me...
I said she is beautiful... :)
They are good in on way they did not start acting on me....
They asked my name... I replied...
one of the guys questioned me...
Aren't you Rahul Sharma?? I said who the hell is rahul sharma?
I am so and so... working for so and so.. without me completing my statements,
they started saying sorry...
I shouted... are you mad? what the hell do you think of yourself?
Is this the way to do things? you should get the guys photo not the girls...

One of the guys fetched me a glass of water and tried making me cool....
I was drinking water...
He narrated the actual story... Then I got the clear picture of what has happened.
Phone started buzzing... its mot my ringtone...
They got a call from the girl saying that Rahul sharma has agreed for marriage and they are on the way to the temple.
I was angry by looking at their face ...
They seemed to be good friends of the girl and they did not treat me in a very bad way but a slap and they zipping my mouth is the only thing i did not like.

So... excused the guys... One of the guy who handled the remote asked me "You wanna join us for the marriage?" I joined them and started to marriage from my room.... Their plan is good... brought a Omini.. which is best suited for a kidnap...
Attended the marriage... No elders were there... a love marriage.. that too girls friends came to take the guy...
Its awesome.. :)

After the marrige, the two guys introduced me to Mr.RahulSharma and Mrs.Rahulsharma...they explained each and everything.. They begged  my pardon and thanked me for attending the marriage...

I said that's fine and Wished them a Happy Married Life and left the place.
Before leaving the place,I asked Rahul Sharma for his address... Everything is fine including the door number except the name and block...

D-block is where I stay...but Someone has written D-block instead of P-block.
The guys were extremely sorry for what had happened...
I said bye and left from the temple.

While I was walking back to my room... I started thinking...
Things went on very funnily...
How come one can kidnap someone just by knowing the address?
Its a lucky day for me...

The guys are good... if they have treated me in a  bad way... things would have been different.
I cannot stop my laughter whenever I think of this incident.
Everything ended in a good way and they were listed in my good buddy's list.
 



Wednesday, October 26, 2011

సర్వం జగన్నాథం...

                 నాకేం తోచకపోతే దగ్గరలో ఉన్న కోవేలకి వెళ్లి కొంచంసేపు కూర్చుని వీలైతే ఒక కీర్తన ఆలపించి వచ్చేస్తుంటా...
అలాగే ఒక రోజు కోవెలకి బయలుదేరా...
సాయంత్రం 7 కావస్తోంది... చీకటి కమ్ముకుంది... కోవెల వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది... ఆలయ గోపురం విద్యుద్దీపాల వెలుగులో చాలా అందంగా కానవచ్చింది...
వెళ్లేసరికి ఎవరో ఒకాయన కంచు కంఠంతో ప్రవచిస్తున్నారు... 

ఇలా సాగుతోంది ప్రవచనం....
                  "సర్వం విష్ణుమయం జగత్" అని, హరి ఇందు కలడు అందు లేడు అని సందేహం వలదు, లోకమంతా హరిమయమై ఉంటుంది ,నీలో నాలో కూడా ఉన్నాడు హరి,చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో అంటాడు.
అంతలా విశ్వశించాడు కనుకనే హిరణ్యకశిపుని శిక్షలకి కించిత్ కూడా చలించలేదు ప్రహ్లాదుడు.స్వామి, నమ్మిన వాడిని ఎట్లా చూసుకుంటాడో మనకి తెలుసు కదా! గజేంద్రుణ్ణి ఎట్లా రక్షించాడు? పరుగున వచ్చినాడు కదా పంచ ఉడిపొతున్నా సరే!
విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామం విశ్వం. దీనిని  "ఓం విశ్వాయ నమః" అని ఉపాసిస్తాం. ఈ జగత్తంతా వ్యాప్తి చెందినవాడైనందువల్ల అలా పిల్చుకుంటాం. 
"అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణస్థితః" అని కదా మనం రోజు కీర్తించేది.... అని ప్రసంగిస్తున్నారు...

నేను ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నా..
ప్రవచనం పూర్తి అయ్యింది...
ప్రవచనకర్త బయటికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు...

ఒకాయన ప్రవచనకర్తని ఆపి అడిగారు...
అన్నిటా ఉన్నవాడా? మొత్తమంతా వ్యాప్తి చెందాడా? మరి నీలో నాలో కుడా ఉన్నప్పుడు నీకు నాకు తేడా ఏంటి?
నేనెంతో నువ్వు అంతే నువ్వెంతో నేను అంతే కదా... అలాంటప్పుడు అన్నీఒకటే కదా! అని...

నేనలా చూస్తూ ఉన్నా... ఏంటి ఈయన? నువ్వు, నేను ఒకటి అంటాడు...? అన్నీ వేరు వేరుగా ఉన్నాయి కదా?
కొంపతీసి ప్రసాదం కూడా నీది నాది అని లేదు అంటాడో ఏమో? అనుకున్నా...

అవును అన్నీ ఒకటే!
అందుకే సర్వం జగన్నాథం అని అంటుంటాం!

మీకు తెలిసే ఉంటుంది... ఒడ్డెదేశంలో పూరి అని ఓ పుణ్యక్షేత్రం ఉంది... అక్కడ జగన్నాథుడు కొలువై ఉన్నాడు.అక్కడి ప్రసాదం చాలా ప్రసిద్ధి.40 రకాల ప్రసాదాలు చేస్తారు. ప్రసాదాలన్నీకావిళ్ళతో తెచ్చి పెడతారు.
వేడి వేడిగా ప్రసాదం... చాలా బావుంటుంది... జగన్నాధుడికి ప్రసాదాలు ఆరగింపుకి తీసికెళ్ళేటప్పుడు ఎవరూ చూడరాదు.
ఏకః స్వాదు న భుంజీథ అని మన పెద్దలు చెప్తారు....అంటే మధురపదార్ధం ఒక్కడు భుజించకూడదు.ప్రక్కవారికి కూడా పెట్టి అప్పుడు తను తీసుకోవాలి అని.
ఆ దేశం రాజైనా సరే జగన్నాధుడి ప్రసాదం ఎవరు ఇచ్చినా కళ్ళకి అద్దుకుని తీసుకుంటాడు. ఎవరైనా తెలియక వదిలేసినా సరే అక్కడి వారు ప్రసాదం పుచ్చుకుంటారు.
తన,పర భేదం ఉండదు అక్కడ.ఏం చేసినా జగన్నాధునికే అర్పణం...

ఇలా ముగిసింది వాళ్ళిద్దరి సంభాషణ...
నేనింటికి బయల్దేరా... అదే ఆలోచన.... సర్వం జగన్నాథం అని...
అప్పుడనిపించింది....
అందుకే మన ఇళ్ళలో మడి తడి ఆచారం వ్యవహారం అని  ఉన్నా కొన్నిసార్లు అవి ఇవి ముట్టేసుకుంటే  సర్వం జగన్నాథం అనేస్తుంటారు అని.

Sunday, October 23, 2011

ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు మనిషి విలువెరగడు :P



"జంతూనాం నరజన్మ దుర్లభం" అని...  అంటే  జీవరాసులలోఅన్నిటికంటే మనిషిగా జన్మించడం దుర్లభమని పెద్దలు చెప్తూంటారు.ఒక జీవి మనిషిగా జన్మించడం కొన్ని లక్ష జన్మల పుణ్యఫలం వలనే అని మన పురాణాలు  చెప్త్హున్నాయి.అట్లాంటి మానవ జన్మ లభించాక మనిషి తాను చేయవలసిన కార్యాన్ని వదిలేసి ఈ లభించినటువంటి జీవితాన్ని వ్యర్థ పరుచుకుంటున్నాడు.సరైన నడవడి కలిగి,మానవుడు మానవుడిగా ప్రవర్తించినట్టైతే ఉత్తమ గతులను పొందగలడు.మానవుడిగా ఎలా బ్రతకాలో శ్రీ రాముడు త్రేతాయుగంలోనే మనకి నేర్పించాడు.ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ శ్రీ రాముడిలా ఉండలేరు కానీ కొంతలో కొంతైన మనిషిగా ప్రవర్తించడానికి ప్రయత్నిద్దాం!

ముందుగా మానవుడి గురించి 2 మాటలు...

మానవుడు సంఘ జీవి (social animal). వేరే జంతువులకి మనిషికి చాలా తేడ  ఉంది.మనిషి మాట్లాడగలడు, ఆలోచించగలడు,తెలివిగా ప్రవర్తించగలడు.మిగిలిని జంతువులు కూడా మనలాగే పుడుతున్నాయి, ఏదో తిని జీవిస్తున్నాయి, సంసారం చేస్తున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, చచ్చిపోతున్నాయి.కానీ మనిషి తనకే సొంతమైన, వేరొక జీవికి దుర్లభమైన వాటిని ఉపయొగించుకుంటున్నాడు.కాలక్రమేణా చాల విషయాలు నేర్చుకున్నాడు.జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నాడు.ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు , తెలివిని వాడుకుంటున్నాడు, ఎన్నైనా ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎందుకైనా ఎంతకైనా చేయటానికి సిద్ధపడుతున్నాడు.  

సాధారణంగా మనిషి ఆశాజీవి... వేరే ప్రాణులకి మాటలు రాకో మనిషికి అర్థం కాకో బ్రతికిపోయారు కానీ వాటికి కూడా మాటలు వచుంటేనా మానవుడికి చిక్కులు ప్రరంభామైనట్టే. లోకమంతా  గందరగోళం అయిపొదూ? కొన్ని ప్రాణులు ఉ.దా :కుక్క, మార్కట,ఆశ్వ,గాజెంద్రాదులకు కొంత తెలివి ఇచ్చినందువల్ల మనిషి వాటిని కొంచం దరికి చేరుస్తున్నాడు కానీ లేకపోయినట్టైతే వాటివైపే చూడడు,వాటిని చేరదీయాడు. సహప్రాణుల పట్ల ఎలా ప్రవర్తించాలో కుడా రాముడిని చూసి నేర్చుకోవచ్చు .వానరులతోకానీ ఉడత సహాయం కానీ కప్పతో జరిగిన సంఘటన కానీ చూడవచ్చు.మనిషి సహాయం ఇతర జీవులు ఉత్తమ గతులను పొందటానికి దోహద పడుతుంది.

ఇప్పటిలోకంలో చాలమంది రావణులే... 10 తలలు తప్ప మిగిలినవన్నీ సమృద్ధిగా ఉన్నాయి.కలియుగంలో ధర్మం ఒక్కపాదం మీద నడుస్తుందన్నారు కానీ ఆ పాదాన్ని కూడా తెగనరికేస్తున్నారు ఈ నాటి మానవులు. మాంసాహార భక్షణం దగ్గరనుంచి మానభంగాలవరకు మన పురాణాలలో పేర్కొన్న రాక్షసులకి దీటుగా, ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారు.

జీవితాన్ని మంచిగా మానవత్వంతో సాగించాలి.మాధవ సేవగా మనవ సేవ, సర్వప్రాణి సేవ చేయాలి.
మాధవ సేవ చాల సులభం!
పోతనామాత్యుడు భాగవతంలో చెప్తాడు

        "కమలాక్షునర్చించు కరములు కరములు
         శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
         సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
         శేష సాయికి మ్రొక్కు శిరము శిరము
         విష్ణునాకర్ణించు వీనులు వీనులు
         దేవదేవుని చింతించు దినము దినము
         మధువైరి దవిలిన మనము మనము
         భగవంతు వలగొను పదములు పదములు
         పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి " అని  మనకి ఈ జన్మ లభించినది వాడి వల్లే! అట్లాంటి స్వామిని కీర్తించకుండా ఏది చేసిన వ్యర్థమే!

ఎన్నో జన్మల పుణ్యఫలం వలన కలిగిన ఈ జన్మని చరితార్థం చేసుకోవడానికి చాల మార్గాలున్నా  కూడా  అత్యంత  సులువైన పద్ధతిని మన పెద్దలు చూపించారు.ముఖ్యంగా కలియుగంలో స్వామిని చేరడం ఎంత సులభమో! కలియుగంలో కేవలం నామసంకీర్తనంతో స్వామిని చేరుకోవచ్చు అని వారి జీవితాన్ని సార్ధక్య పరుచుకున్న వారిలో శ్రీ కాంతకృష్ణమాచార్యులు, అన్నమాచార్యులు, రామదాసు, మొదలైనవారు మనకి మార్గదర్శకులు.
 ఈ జీవితాన్ని సార్థక్యం చేసుకోవడానికి శ్రీహరికీర్తనం చేస్తే చాలు."హరి" అన్న ఒక్క పదం చాలు

       "హరిర్ హరతి పాపాని దుష్ట చిత్తై రపిస్మ్రుతః ...
        జిహ్వాగ్రే వర్తతే యస్య  హరిరితి అక్షరద్వయం" అని హర్యష్టకంలో చెప్పారు కదా!
హరి అంటే చాలు అన్ని పాపలు తొలగిపోతాయి.
శ్రీహరి పద చింతనలో ఉన్న ఆనందం వర్ణింపదగనిది.అంటే అది అనుభవిస్తేతప్ప దాని రుచి తెలియదు!!

కనుక మానవ జన్మ విలువని తెలుసుకుని ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా హరి చింతనతో గడుపుదాం!